Sangareddy Car Accident | విద్యుత్​ స్తంభాన్ని ఢీకొన్న కారు.. దంపతుల మృతి

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో దంపతులు మృతి చెందారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Sangareddy Car Accident | సంగారెడ్డి జిల్లా (Sangareddy District)లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సోమవారం అర్ధరాత్రి ఓ కారు అతివేగంగా దూసుకొచ్చి విద్యుత్​ స్తంభాన్ని ఢీకొని, బోల్తా పడింది. ఈ ప్రమాదంలో దంపతులు మృతి చెందారు.

Sangareddy Car Accident | సంగారెడ్డి వెళ్తుండగా..

సంగారెడ్డి జిల్లా కంది మండలం కాశింపూర్ గ్రామం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం గాజులగూడ గ్రామానికి చెందిన నర్సింలు (40), ఆయన భార్య మౌనిక (30) రాత్రి పూట కారులో వెళ్తున్నారు. ఆ సమయంలో కారు అదుపు తప్పి డివైడర్​ మధ్యలో ఉన్న విద్యుత్​ స్తంభాన్ని ఢీకొంది. అనంతరం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో దంపతులు ఇద్దరు తీవ్రగాయాలతో అక్కడిక్కడే మృతి చెందారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. వారు సంగారెడ్డి వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి..: Murasu Cyclone | తీరం దాటిన మురాసు తుపాన్​.. పలు జిల్లాల్లో భారీ వర్షాలు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *