AI in Police Department | పోలీస్ శాఖలో ఏఐ వినియోగం మరింత విస్తృతం చేయాలి

పోలీస్ శాఖలో ఏఐ వినియోగాన్ని మరింత విస్తృతం చేయాలని అదనపు డీసీపీ (అడ్మిన్) శుభం ప్రకాష్ సూచించారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​క్రైం: AI in Police Department | పోలీస్ శాఖలో ఏఐ వినియోగాన్ని మరింత విస్తృతం చేయాలని అదనపు డీసీపీ (అడ్మిన్) శుభం ప్రకాష్ సూచించారు. సీపీ (CP Sai Chaitanya) కార్యాలయం​లో గురువారం సమీక్ష నిర్వహించారు.

AI in Police Department | సాంకేతికతతో రక్షణ..

సమావేశానికి వివిధ కళాశాలల ప్రిన్సిపాళ్లు, ప్రొఫెసర్లు, ఫ్యాకల్టీ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పోలీస్ శాఖలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఏ విధంగా అనుసంధానం చేయాలి.. పోలీసింగ్‌లో ఏఐ ఆధారిత సాంకేతికతను ఏయే రంగాల్లో వినియోగించుకోవచ్చనే అంశాలపై విస్తృతంగా చర్చించారు. ప్రత్యేకంగా నేరాల విశ్లేషణ , నేరాల నివారణ, క్రైం డేటా విశ్లేషణ, అనుమానాస్పద కార్యకలాపాల గుర్తింపు, ట్రాఫిక్ నిర్వహణ, సీసీటీవీ ఫుటేజీ విశ్లేషణ, సైబర్ నేరాల దర్యాప్తు, సోషల్ మీడియా మానిటరింగ్, ప్రజలకు పోలీస్ సేవలను మరింత వేగంగా అందించడం వంటి అంశాల్లో ఏఐ సాంకేతికతను వినియోగించుకునే అవకాశాలపై సమీక్షించారు. సమావేశంలో నవ్య భారతి జాయింట్ సెక్రెటరీ డాక్టర్ శిరీష్, విజయ రూరల్ ఇంజనీరింగ్ కాలేజీ వైస్ ప్రిన్సిపాల్ స్వప్న, ఫ్యాకల్టీ సుజాత, నవ్య, లక్ష్మి, కాకతీయ కాలేజీ ప్రతినిధులు డి.వేణుగోపాల్, నాగార్జున, క్షత్రియ ఇంజినీరింగ్ కాలేజ్ నుండి ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీనివాస్, సీవోడీ లక్ష్మణ్, సంబంధిత అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

AI in Police Department

ఇది కూడా చదవండి..: TOSS Exams Security | ఓపెన్​ స్కూల్​సొసైటీ పరీక్షలకు కట్టుదిట్టమైన భద్రత : సీపీ సాయిచైతన్య

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *