అక్షరటుడే, కామారెడ్డి: Police Officers Association | జిల్లా పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గ ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా ముగిశాయి. ఈనెల 19వ తేదీన జిల్లా ( Kamareddy) పోలీస్ కార్యాలయంలో ఎస్పీ రాజేశ్ చంద్ర (SP Rajesh Chandra) మార్గదర్శకత్వంలో ఈ ఎన్నికల ప్రక్రియ నిర్వహించారు.
Police Officers Association | ఉత్సాహంగా పాల్గొన్న సిబ్బంది
ఎన్నికలకు నోడల్ అధికారిగా ఏఆర్ డీఎస్పీ ఉదయ్ భాస్కర్ డీఎస్పీ, ఎన్నికల నిర్వహణ కమిటీ సభ్యుడిగా స్పెషల్ బ్రాంచ్ సీఐ ఎన్ మధుసూదన్ గౌడ్ వ్యవహరించారు. జిల్లా పరిధిలోని వివిధ విభాగాలు, పోలీస్ స్టేషన్లు, ఏఆర్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులు, సిబ్బంది ఎన్నికల్లో ఉత్సాహంగా పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో అధ్యక్షుడిగా కే. రంజిత్ రెడ్డి ఎన్నికయ్యారు. వైస్ ప్రెసిడెంట్లుగా ఆర్ఐ బి. సంతోష్ కుమార్, ఆర్ఎస్ఐ పీఎన్ సాయి ప్రసన్న, సెక్రెటరీగా బాన్సువాడ సీఐ తులా శ్రీధర్, జాయింట్ సెక్రెటరీగా హెడ్ కానిస్టేబుల్ కె. మధుకర్ హెడ్, ఆర్గనైజింగ్ సెక్రెటరీగా ఎల్. శ్రీనివాస్, ట్రెజరర్‌గా ఏఆర్పీసీ పీసీ ఎస్. సాయిలు ఎన్నికయ్యారు. ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా జే. సుధాకర్ రెడ్డి, డీ. సాయిబాబా, బి. వెంకటేశం, వై. అనంతజ్యోతి, జీ. సాయిలు, ఎం. తారాసింగ్ ఎన్నికయ్యారు.
Police Officers Association | ఎస్పీని కలిసిన నూతన కార్యవర్గ సభ్యులు
నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు సోమవారం జిల్లా ఎస్పీ రాజేష్ చంద్రను కలిశారు. నూతన కార్యవర్గాన్ని ఎస్పీ రాజేష్ చంద్ర, అడిషనల్ ఎస్పీ నర్సింహారెడ్డి అభినందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పోలీస్ అధికారుల సంక్షేమం, సిబ్బంది సమస్యల పరిష్కారం, పోలీస్ శాఖలో ఐక్యతను మరింత బలోపేతం చేయడంతో పాటు సంక్షేమ కార్యక్రమాల కోసం సమర్థవంతంగా పనిచేయాలని ఆకాంక్షించారు.
ఇది కూడా చదవండి: హోంమంత్రి అనితపై పడిన డ్రోన్