అక్షరటుడే, వెబ్‌డెస్క్: Telangana Governor Visit | తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ఆగస్టు 25న (మంగళవారం) నిజామాబాద్ జిల్లా (Nizamabad District)లో పర్యటించనున్నారు. నగరంలోని పసుపుబోర్డు కార్యాలయంలో రైతులతో మార్కెట్ లింకేజ్ కార్యక్రమంతో పాటు వివిధ ప్రోగ్రామ్స్‌లో పాల్గొననున్నారు.
Telangana Governor Visit | ఉదయం 10.20 గంటలకు ఇందూరుకు..
ఆగస్టు 25న ఉదయం 9:15 గంటలకు లోక్ భవన్ నుంచి బయలుదేరి బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా నిజామాబాద్ ఐడీవోసీ హెలిప్యాడ్‌కు 10:20 గంటలకు వస్తారు. ఆ తర్వాత పోలీస్ పరేడ్ గ్రౌండ్లో యాంటీ-డ్రగ్ అవేర్‌నెస్ ప్రోగ్రాం, నేషనల్ టర్మరిక్ బోర్డులో రైతులతో మార్కెట్ లింకేజ్ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం పీహెచ్‌ఆర్ కన్వెన్షన్ సెంటర్లో అర్వింద్ ధర్మపురి ఫౌండేషన్ ద్వారా చేపట్టనున్న ఆర్థిక సహాయం పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతారు. సాయంత్రం 3:20 గంటలకు తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరుతారు.
ఇది కూడా చదవండి..: Young India School | యంగ్ ఇండియా పాఠశాల కామారెడ్డిలోనే ఏర్పాటు చేయాలి