Kamareddy | అమ్మకు చివరి వీడ్కోలు పలికిన కూతురు.. హృదయాన్ని కదిలించిన ఘటన

కన్నతల్లికి కడసారి వీడ్కోలు పలకడానికి కొడుకు ఉండాలనే పాత ఆచారాన్ని ఒక కూతురు తన ప్రేమతో చెరిపేసింది.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | కన్నతల్లికి కడసారి వీడ్కోలు పలకడానికి కొడుకు ఉండాలనే పాత ఆచారాన్ని ఒక కూతురు తన ప్రేమతో చెరిపేసింది. తల్లికి తానే కొడుకుగా మారి అంతిమ సంస్కారాలు నిర్వహించిన ఘటన కామారెడ్డి (Kamareddy) మున్సిపాలిటీ పరిధిలోని అడ్లూర్ గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది.

Kamareddy | అడ్లూర్​లో..

మున్సిపల్ పరిధిలోని అడ్లూర్ 2వ వార్డు ఎస్సీ కాలనీకి చెందిన పెరుమాండ్ల రాజమణి (65) అనారోగ్యంతో సోమవారం తుదిశ్వాస విడిచారు. ఆమెకు ఉన్నది ఒక్కగానొక్క కుమార్తె భూమవ్వ మాత్రమే. తల్లి మృతితో కుంగిపోయినా, ధైర్యం తెచ్చుకుంది భూమవ్వ. బంధువులు, కాలనీ వాసుల సమక్షంలో తల్లి అంతిమ సంస్కాలు నిర్వహించింది. ఈ సమయంలో కూతురి రోదనలు అందరినీ కలచివేశాయి. మారుతున్న కాలంలో ఆడపిల్లలు కూడా అన్ని బాధ్యతలు మోయగలరని, ఇలాంటి ఘటనలు సమాజంలో వస్తున్న మార్పుకు నిదర్శనమని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

ఇది కూడా చదవండి: Vijay Sai Reddy | మత మార్పిడులను ప్రోత్సహించిన జగన్ : మాజీ ఎంపీ విజయ సాయిరెడ్డి

 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *