Leopard Attack in Yellareddy | తాడ్వాయిలో చిరుత కలకలం.. లేగ దూడలపై దాడి..

shashi kiran Mottala

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Leopard Attack in Yellareddy | తాడ్వాయి మండలంలో చిరుత దాడి ఘటన కలకలం రేపింది. మండలంలోని (Tadvai Mandal) నందివాడ పరిధిలో గల సామ దుబ్బ తండాలో ఆదివారం రాత్రి లేగ దూడలపై చిరుత దాడి చేసింది.

Leopard Attack in Yellareddy | గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం..

బాధితుల వివరాల ప్రకారం.. తండాకు చెందిన రైతు రమావత్ రమేష్ ఆదివారం రాత్రి తన లేగ దూడలను ఇంటి పక్కనే ఉన్న పశువుల పాకలో కట్టివేశాడు. అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా దాడి చేసిన చిరుత పులి (Leopard)  పాకలో ఉన్న రెండు లేగదూడలను అక్కడికక్కడే హతమార్చింది. మరో దూడను కొంతదూరం లాక్కెళ్లి చంపేసింది. ఈ దాడిలో తనకు సుమారు రూ.50 వేల వరకు నష్టం వాటిల్లిందని, కష్టం చేసుకుని బతికే తనను ప్రభుత్వం, అధికారులు ఆర్థికంగా ఆదుకోవాలని బాధితుడు రమేష్ విజ్ఞప్తి చేశాడు.

స్థానికుల్లో భయాందోళన..

చిరుత దాదుల్లో మూడు దూడలు చనిపోవడంతో తండాలో భయాందోళన నెలకొన్నాయి. తరచూ అటవీ ప్రాంతం నుంచి చిరుతలు, ఇతర క్రూరమృగాలు జనావాసాల్లోకి వస్తున్నాయని, పశువులపై దాడులు చేస్తున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటవీశాఖ అధికారులు (Forest Department Officers) స్పందించి చిరుత సంచారాన్ని అరికట్టాలని, బాధిత రైతుకు నష్టపరిహారం అందించాలని గ్రామస్థులు కోరుతున్నారు. రాత్రిపూట ఆరు బయట తిరగాలంటే భయపడాల్సిన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి..: Gambling Den Raid | పేకాట స్థావరంపై పోలీసుల దాడి

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *