Disaster Management Drill | ప్రజల ప్రాణాల రక్షణే లక్ష్యం : మంత్రి పొంగులేటి

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్: Disaster Management Drill | ప్రజల ప్రాణాలు, ఆస్తులను కాపాడటమే ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) అన్నారు. వరదలు, అగ్నిప్రమాదాలు, పారిశ్రామిక ప్రమాదాలు వంటి అత్యవసర పరిస్థితుల్లో వేగవంతమైన స్పందన, శాఖల మధ్య సమన్వయం, ముందస్తు సన్నద్ధత ఎంతో కీలకమని పేర్కొన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన విపత్తు నిర్వహణ మాక్ ఎక్సర్‌సైజ్‌లలో భాగంగా సోమవారం హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్ హెచ్‌ఎండీఏ గ్రౌండ్స్ వద్ద నిర్వహించిన భారీ వరద మాక్ డ్రిల్‌ (Mock Drill)ను సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు. విపత్తులు సంభవించినప్పుడు మొదటి గంట అత్యంత కీలకమన్నారు. ఆ “గోల్డెన్ అవర్”లో తీసుకునే చర్యలే ప్రాణాలను కాపాడగలవని పేర్కొన్నారు. అగ్నిప్రమాదాలు, వరదలు, ఆకస్మిక ప్రమాదాలు సంభవించినప్పుడు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, వేగంగా సహాయక చర్యలు చేపట్టడం, అత్యవసర సేవలను సమన్వయం చేయడం కోసం ఇటువంటి మాక్ డ్రిల్‌లు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు.

Disaster Management Drill | అప్రమత్తంగా ఉండాలి

హైదరాబాద్ (Hyderabad) 1908లో మహావరదలను, ఇటీవలి గోదావరి–కృష్ణా వరదలను మంత్రి ప్రస్తావించారు. విపత్తుల విషయంలో అప్రమత్తంగా లేకపోతే ఎంతటి నష్టం జరుగుతుందో చరిత్ర చెబుతోందన్నారు. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు సాంకేతిక పరిజ్ఞానం, అత్యాధునిక పరికరాలు, శిక్షణ పొందిన బృందాలు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని సూచించారు. అడవుల్లో సంభవించే అగ్నిప్రమాదాలు పచ్చదనాన్ని నాశనం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణ ప్రాంతాల్లో పెరుగుతున్న అగ్నిప్రమాదాలు (Fire Accidents) కూడా తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు.

మాక్ డ్రిల్‌లో భాగంగా గాలితో నింపే లైఫ్ బోట్లు, నీటిలో చిక్కుకున్న వారిని రక్షించే సాంకేతిక పద్ధతులు, అత్యవసర తరలింపు చర్యలు, సమన్వయంతో కూడిన రెస్క్యూ ఆపరేషన్‌లను ప్రత్యేక బృందాలు ప్రత్యక్షంగా ప్రదర్శించాయి. అనంతరం మంత్రి నెక్లెస్ రోడ్ బోటింగ్ క్లబ్ ను సందర్శించి రెస్క్యూ కార్యకలాపాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో విపత్తు నిర్వహణ శాఖ కార్యదర్శి దాసరి హరిచందన, అగ్నిమాపక శాఖ డీజీ విక్రమ్ సింగ్ మాన్, హైడ్రా కమిషనర్ రంగనాథ్ (Hydra Commissioner Ranganath), ఎన్‌డీఎంఏ లీడ్ కన్సల్టెంట్ మేజర్ జనరల్ (రిటైర్డ్) సుధీర్ బెల్ పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Swimming Pool Death | బర్త్​ డే వేడుకల్లో విషాదం.. స్విమ్మింగ్ ​పూల్​లో పడి యువకుడి మృతి

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *