Swimming Pool Death | బర్త్​ డే వేడుకల్లో విషాదం.. స్విమ్మింగ్ ​పూల్​లో పడి యువకుడి మృతి

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Swimming Pool Death | స్విమ్మింగ్​ పూల్​లో పడి ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన హైదరాబాద్​ (Hyderabad) శివారులోని మొయినాబాద్​ మండలంలో చోటు చేసుకుంది.

మొయినాబాద్ మండలం (Moinabad Mandal) కనకమామిడి గ్రామ శివారులోని వ్యాస ఫామ్ హౌస్‌ ఉంది. ఈ ఫామ్​హౌస్​లో జరిగిన బర్త్​ డే పార్టీకి హైదరాబాద్ మజీద్‌బండకు చెందిన సాయి హాజరు అయ్యాడు. అతడు యాక్సిస్ బ్యాంక్ సెక్యూరిటీ గార్డ్​గా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే ఆదివారం రాత్రి పుట్టిన రోజు వేడుకల్లో సాయి స్విమ్మింగ్​ పూల్​లో పడి చనిపోయాడు. అయితే ఎవరు అతడిని గమనించలేదు. సోమవారం ఉదయం ఫామ్​హౌజ్​ వాచ్​మన్​ గమనించి స్నేహితులకు సమాచారం ఇచ్చారు.

Swimming Pool Death | తల్లిదండ్రుల అనుమానం

స్విమ్మింగ్​ పూల్​ నుంచి సాయిని తీసి వెంటనే స్నేహితులు ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అతడు మృతి చెందాని వైద్యులు తెలిపారు. దీంతో పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య, ఏడాది కుమారుడు ఉన్నారు.మృతుడి తల్లిదండ్రులు farmhouseకు చేరుకోకముందే, మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రి (Osmania Hospital)కి తరలించడంపై కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కుమారుడి మృతిపై వారు అనుమానాలు వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి..: Youth Sports Festival | నేటి నుంచి క్రీడా – యువజన వారోత్సవాలు

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *