అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Hussain Sagar FTL | హైదరాబాద్ (Hyderabad)లోని హుస్సేన్‌సాగర్ ఎఫ్‌టీఎల్ పరిధిలో భారీ భవనం నిర్మిస్తున్న ప్రదీప్ కన్స్ట్రక్షన్కు జీహెచ్ఎంసీ అధికారులు షాక్ ఇచ్చారు. భవన అనుమతిని రద్దు చేస్తూ షో కాజ్ నోటీసు జారీ చేశారు. అలాగే, నో ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ కూడా జారీ చేశారు.
సోమాజిగూడలోని రాజభవన్ రోడ్డులో (పార్క్ హోటల్ / నెక్లెస్ రోడ్డు సమీపంలో) ఈ బహుళ అంతస్తుల గ్రూప్ హౌసింగ్ ప్రాజెక్ట్ (రెండు టవర్లు, 2 సెల్లార్లు + స్టిల్ట్ + 17 పై అంతస్తులు, క్లబ్ హౌస్‌తో) నిర్మించారు. అయితే హుస్సేన్ సాగర్ ఎఫ్‌టీఎల్ పరిధిలో దీనిని నిర్మించినట్లు ఫిర్యాదులు అందాయి. దీంతో సోమవారం హైడ్రా, జీహెచ్ఎంసీ కమిషనర్లు రంగనాథ్ గారు, ఆర్వీ కర్ణన్ సోమవారం ఆ భవనాన్ని పరిశీలించారు. ప్రదీప్ కన్‌స్ట్రక్షన్స్ చేపట్టిన భవన నిర్మాణానికి తమ నుంచి ఎలాంటి అనుమతులు లేవని ఇరిగేషన్ శాఖ ఈ సందర్భంగా తెలిపింది. ఈ క్రమంలో తాజాగా జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు జారీ చేయడం గమనార్హం.
Hussain Sagar FTL | తప్పుడు సమాచారంతో..
తప్పుడు సమాచారం ఇవ్వడం, కీలక వాస్తవాలను దాచిపెట్టడం ద్వారా అనుమతులు పొందారనే కారణంతో భవన అనుమతిని రద్దు చేయాలని జీహెచ్ఎంసీ ప్రతిపాదించింది. ఈ విచారణలు పూర్తయ్యేంత వరకు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ దరఖాస్తును నిలిపివేశారు. కాగా ఈ కంపెనీ యజమాని ప్రదీప్ రెడ్డి బద్వేలు. జీవో 111 ప్రాంతంలోని జన్‌వాడలో ఉన్న ఒక ఫామ్‌హౌస్‌పై యాజమాన్యాన్ని క్లెయిమ్ చేసిన రియల్టర్ కూడా ఈయనే కావడం గమనార్హం. ఆ ఫామ్‌హౌస్ మాజీ మంత్రి కేటీఆర్‌కు చెందినదని, ప్రదీప్ బినామీ అని సీఎం రేవంత్ ఆరోపించారు.
ఇది కూడా చదవండి..: Basara Temple Donation | బాసర అమ్మవారి అనుగ్రహానికి భక్తి కానుక.. గర్భగుడి నిర్మాణానికి రూ.31 కోట్ల మహాదానం