Lift Rope Accident | తెగిపడిన లిఫ్ట్ రోప్​.. మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కు తప్పిన ప్రమాదం

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Lift Rope Accident | తెలంగాణ ప్రభుత్వ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. కరీంనగర్​లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో బుధవారం ఊహించని ప్రమాదం చోటుచేసుకుంది. ఆసుపత్రిలోని లిఫ్ట్ కేబుల్ (రోప్) తెగిపోవడంతో మంత్రి లక్ష్మణ్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

Lift Rope Accident | అసలేం జరిగిందంటే..?

కరీంనగర్​లోని ఒక ప్రైవేటు హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న రోగిని పరామర్శించడానికి మంత్రి లక్ష్మణ్ తన సిబ్బందితో కలిసి వెళ్లారు. రోగి ఉన్న ఫ్లోర్‌కు వెళ్లేందుకు తన వ్యక్తిగత సిబ్బందితో కలిసి లిఫ్ట్ ఎక్కారు. అయితే, లిఫ్ట్ పైకి వెళ్తున్న సమయంలో అకస్మాత్తుగా దాని కేబుల్​ (రోప్) తెగిపోయింది. దీంతో ఒక్కసారిగా లిఫ్ట్ కిందికి పడిపోయింది. ఈ ప్రమాద తీవ్రతకు మంత్రి అడ్లూరికి స్వల్ప గాయాలయ్యాయి.

Lift Rope Accident | తృటిలో తప్పిన పెద్ద ముప్పు

లిఫ్ట్ కింద పడటంతో లోపల ఉన్నవారంతా ఆందోళనకు గురయ్యారు. అయితే, ప్రమాదం జరిగిన వెంటనే మంత్రి వ్యక్తిగత భద్రతా సిబ్బంది (గన్‌మెన్లు), అనుచరులు అప్రమత్తంగా వ్యవహరించారు. క్షణాల వ్యవధిలో లిఫ్ట్ తలుపులు తెరిచి, మంత్రిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.

సకాలంలో స్పందించి మంత్రి అడ్లూరిని బయటకు తీయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉందని, ఆందోళన చెందాల్సిన పనిలేదని వైద్యులు, మంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి.

Lift Rope Accident | భద్రతా లోపాలపై విమర్శలు

ప్రముఖ ప్రైవేటు ఆసుపత్రిలో ఇలాంటి సాంకేతిక లోపం తలెత్తడం, ఏకంగా ఒక మంత్రికే ప్రమాదం జరగడంపై పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రి యాజమాన్యం నిర్వహణ లోపాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

NEET Paper Leak | విద్యార్థుల గొంతుకపై ‘లీకేజీ’ కత్తి.. నీట్ కుంభకోణం వెనుక అసలు దందా ఇదేనా?

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *