Kamareddy Fuel Shortage | కామారెడ్డిలో కొనసాగుతున్న పెట్రోల్, డీజిల్ కష్టాలు

Shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Fuel Shortage | వాహనదారులకు తీరని కష్టం వచ్చి పడింది. వరికోతల సమయంలో అన్నదాతలు ఆగం అవుతున్నారు. కామారెడ్డి (Kamareddy) పట్టణంలో రెండోరోజు పెట్రోల్, డీజిల్ కష్టాలు ప్రజలను వెంటాడుతున్నాయి.

Kamareddy Fuel Shortage | డీడీలు చెల్లించని కారణంగా..

రాష్ట్రంలో కొరత లేకున్నా డీడీలు చెల్లించని కారణంగా పెట్రోల్, డీజిల్ కొరత ఉందని ప్రచారం సాగుతోంది. నిన్న మధ్యాహ్నం తర్వాత మూతపడిన పెట్రోల్ బంకులు (Petrol Pumps) ఇప్పటికీ తెరుచుకోలేదు. దాంతో పెట్రోల్, డీజిల్ కొరత నిజంగానే ఉండదేమోనన్న భయంతో ప్రజలు వాటర్ బాటిల్స్, డీజిల్ క్యాన్లతో అందుబాటులో ఉన్న బంకుల వద్ద భారీగా క్యూ కట్టారు. ప్రస్తుతం వరికోతలు కొనసాగుతున్నాయి. వరికోత మిషన్లకు డీజిల్ కచ్చితంగా అవసరం కావడంతో క్యాన్లతో క్యూలో నిలబడ్డారు. ద్విచక్ర వాహనదారులు, కార్లలో మోతాదుకు మించి పెట్రోల్ పోయించుకుంటున్నారు. వాహనాలలో మాత్రమే కాకుండా ప్రత్యేకంగా వాటర్ బాటిల్స్ తెచ్చుకుని వాటిలో పెట్రోల్ తీసుకుని వెళ్తున్నారు.

Kamareddy Fuel Shortage | ఇంకెన్ని రోజులు ఈ కష్టాలు..

ఈ పెట్రోల్ కష్టాలు ఇంకా ఎన్నిరోజులు కొనసాగుతాయో అర్థం కాని పరిస్థితి నెలకొంది. కామారెడ్డి పట్టణంలో దాదాపు 14 పెట్రోల్ బంకులు ఉన్నాయి. నిజాంసాగర్​ రహదారిలో ఉన్న నాలుగు పెట్రోల్ బంకులు, నిజాంసాగర్ చౌరస్తా నుంచి హైదరాబాద్ (Hyderabad) వెళ్లే దారిలో నాలుగు పెట్రోల్ బంకులు మూసివేశారు. నిజాంసాగర్ చౌరస్తాలో ఉన్న ఒకే బంకులో పెట్రోల్, డీజిల్ ఉండడంతో ఆ బ్యాంకులో ప్రజలు పెద్దఎత్తున క్యూ కట్టారు. నిజాంసాగర్ చౌరస్తా నుంచి కొత్త బస్టాండ్, టేక్రియల్ బైపాస్ వరకు ఉన్న మూడు బంకులు మూసివేశారు. పాత బస్టాండ్ నుంచి సిరిసిల్ల దారిలో ఉన్న నాలుగు బంకులు, గుమస్తా కాలనీ వద్ద ఉన్న పెట్రోల్ బంక్ మూసి ఉన్నాయి. దాంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఇది కూడా చదవండి..: Seethakka Nizamabad Tour | మంత్రి సీతక్క పర్యటన ఏర్పాట్ల పరిశీలన

2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *