CP Saichaitanya Jail Review | జిల్లా జైలును పరిశీలించిన సీపీ సాయిచైతన్య

నిజామాబాద్ కేంద్ర కారాగారాన్ని సీసీ సాయిచైతన్య సోమవారం పరిశీలించారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: CP Saichaitanya Jail Review | నిజామాబాద్(Nizamabad) కేంద్ర కారాగారాన్ని సీసీ సాయిచైతన్య(CP Saichaitanya ) సోమవారం పరిశీలించారు. ఈ మేరకు జైలులో భద్రతా ఏర్పాట్లపై సూపరింటెండెంట్​ అశోక్​తో సమీక్షించారు.

CP Saichaitanya Jail Review | భద్రతా ఏర్పాట్ల పరిశీలన

జైలులో సెక్యూరిటీ రివ్యూ మీటింగ్‌లో భద్రతా చర్యలు, సీసీ కెమెరాలు, ప్రహరీ, బందోబస్తు, హాస్పిటల్, డీ-అడిక్షన్ సెంటర్‌లపై సీపీ సమీక్ష నిర్వహించారు. జైలు భద్రత విషయంలో ప్రతి అధికారి, సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని, విధుల్లో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా నిబంధనల ప్రకారం విధులు నిర్వహించాలని సూచించారు. కేంద్ర కారాగారంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల వ్యవస్థను పోలీస్ కమిషనర్ క్షుణ్ణంగా పరిశీలించారు. జైలు పరిసర ప్రాంతాలు, ప్రధాన ప్రవేశ ద్వారాలు, కీలక ప్రదేశాలు నిరంతరం కెమెరాల నిఘాలో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సీసీ కెమెరాలు నిరంతరం పనిచేసేలా వాటి నిర్వహణ, రికార్డింగ్ వ్యవస్థ, పర్యవేక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు.

CP Saichaitanya Jail Review | ప్రహరీ, బందోబస్తు ఏర్పాట్ల పరిశీలన

కేంద్ర కారాగారం చుట్టూ ఉన్న ప్రహరీ భద్రతను కూడా కమిషనర్ పరిశీలించారు. ప్రహరీ గోడ వద్ద ఎలాంటి భద్రతా లోపాలు లేకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు. జైలు వద్ద విధులు నిర్వహిస్తున్న బందోబస్తు సిబ్బంది అప్రమత్తత, విధుల నిర్వహణ, పహారా విధానాలను సమీక్షించారు.

CP Saichaitanya Jail Review | హాస్పిటల్, డీ-అడిక్షన్ సెంటర్ పరిశీలన

కేంద్ర కారాగారంలోని హాస్పిటల్, డీ-అడిక్షన్ సెంటర్లను కూడా పోలీస్ కమిషనర్ సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. ఖైదీలకు అందుతున్న వైద్య సేవలు, భద్రతా ఏర్పాట్లు, సిబ్బంది పర్యవేక్షణ తదితర అంశాలపై వివరాలు తెలుసుకున్నారు. డీ-అడిక్షన్ సెంటర్‌లో చికిత్స పొందుతున్న వారికి భద్రతతో పాటు అవసరమైన సేవలు అందేలా సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

అప్రమత్తతే ప్రధాన లక్ష్యం

కేంద్ర కారాగారం అత్యంత కీలకమైన భద్రతా ప్రదేశమని , అక్కడ విధులు నిర్వహించే సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని పోలీస్ కమిషనర్ సూచించారు. భద్రతా ప్రమాణాలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, గుర్తించిన లోపాలను వెంటనే సరిదిద్దుకోవాలని తెలిపారు. జైలు అధికారులు, పోలీస్ శాఖ భద్రతా సిబ్బంది పరస్పర సమన్వయంతో పనిచేస్తే భద్రతను మరింత సమర్థవంతంగా నిర్వహించవచ్చని పేర్కొన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ జైలర్ మన్మథరావు, జైలర్లు తిరుమలరెడ్డి , శ్రీనివాస్ రెడ్డి, రిజర్వ్ ఇన్​స్పెక్టర్​ (అడ్మిన్) ధరణి కుమార్, మెడికల్ ఆఫీసర్ సామ్రాట్, 6వ టౌన్ ఎస్సై సందీప్ తదితరులు పాల్గొన్నారు.

పోలీస్​ ప్రజావాణిలో 34 ఫిర్యాదుల స్వీకరణ

పోలీస్​ ప్రజావాణిలో సీపీ సాయిచైతన్య 34 ఫిర్యాదులు స్వీకరించారు.  ఫిర్యాదుదారుల సమస్యలను విని వాటిని చట్టప్రకారం పరిష్కరించాల్సిందిగా సంబంధిత అధికారులకు సీపీ సూచించారు. ప్రజలు నిర్భయంగా, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా ఎలాంటి, పైరవీలు లేకుండా స్వచ్చందంగా పోలీసు సేవల్ని వినియోగించుకోవాలని పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై ఫిర్యాదులు నేరుగా స్వీకరిస్తూ ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం ద్వారా సమస్యలు పరిష్కారిస్తున్నామని ఆయన తెలియజేశారు.

ఇది కూడా చదవండి: మూడు దశాబ్దాల కల సాకారమైంది.. వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభమైంది..! 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *