Rajiv Gandhi Tribute | యువతకు ప్రత్యక్ష రాజకీయాల్లో అవకాశం కల్పించిన ఘనత రాజీవ్​దే : డీసీసీ అధ్యక్షుడు నగేష్​ రెడ్డి

shashi kiran Mottala

అక్షరటుడే, ఇందూరు: Rajiv Gandhi Tribute | యువత ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనే విధంగా ఓటు హక్కును 18 ఏళ్లకు కుదించిన ఘనత రాజీవ్ గాంధీదేనని (Rajiv Gandhi) డీసీసీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి అన్నారు. నగరంలోని కాంగ్రెస్ భవన్​లో (Congress Bhavan) రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం జీజీహెచ్​లో(Nizamabad GGH) పండ్లు, బ్రెడ్ ప్యాకెట్లు పంపిణీ చేశారు.

Rajiv Gandhi Tribute | రాజీవ్​ హయాంలో పెను మార్పులు

రాజీవ్ గాంధీ హయాంలో దేశంలో పెను మార్పులు తీసుకొచ్చారని.. మహాత్మా గాంధీ ఆశయం మేరకు గ్రామాల్లో పంచాయతీలకు నిధులు వచ్చే విధంగా రాజ్యాంగ హోదా కల్పించారన్నారు. 1988లో 61వ రాజ్యాంగ సవరణ ద్వారా దేశంలోని యువకులకు ఓటు హక్కును 18 ఏళ్లకు కుదించారన్నారు. టెలీ కమ్యూనికేషన్ రంగాన్ని అభివృద్ధి చేసింది రాజీవ్ గాంధీనేనని అన్నారు.

Rajiv Gandhi Tribute | టెక్నాలజీకి బ్రాండ్​ రాజీవ్​గాంధీ..

భారతదేశాన్ని ఆధునిక యుగంలోకి నడిపించిన మహా నాయకుడు రాజీవ్ అని నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ అన్నారు. కేవలం 40 ఏళ్ల వయసులోనే దేశ ప్రధాని బాధ్యతలు చేపట్టిన ఆయన రాజకీయాల్లో యువతకు పెద్దపీట వేశారన్నారు. ఈరోజు మనం వాడుతున్న స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు, ఇంటర్నెట్ అన్నింటికీ పునాది వేసింది రాజీవ్ గాంధీనేనని ఆయన స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ (Urdu Academy) ఛైర్మన్ తాహెర్ బిన్ హాందాన్, మేయర్ ఉమారాణి (Mayor Umarani), పీసీసీ ప్రధాన కార్యదర్శి రామ్ భూపాల్, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ అంతరెడ్డి రాజారెడ్డి, జిల్లా కాంగ్రెస్ కోశాధికారి భక్తవత్సలం, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు తారాచాంద్, కౌడపు శరత్, వేంపల్లి రత్నాకర్ గౌడ్, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ గౌడ్, కంజర్ రవి, డీసీసీ కార్యదర్శి కద్దురామ్​ సాయి కుమార్​, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు విపుల్ గౌడ్, జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షుడు యాదగిరి, జిల్లా సేవాదళ్ అధ్యక్షుడు సంతోష్, జిల్లా ఏసీ అధ్యక్షులు లింగం, జిల్లా ఫిషరీస్ ఛైర్మన్ శ్రీనివాస్, మాక్లూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రవి, సీనియర్ నాయకులు మీసాల సుధాకర్, జావీద్ అక్రమ్, నగర కాంగ్రెస్ కోశాధికారి సకినాల శివ ప్రసాద్, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శులు రవి, ముల్గురి గణేష్, లింబాద్రి సుభాష్, పులి వెంకటేశ్వర రావు, ఏఎంసీ డైరెక్టర్ రఘు, జెండా గుడి ఛైర్మన్ లవంగ ప్రమోద్, అవిన్, సంగెం సాయిలు, కిష్టాగౌడ్, పోలా ఉష, అపర్ణ, స్వప్న, బంటు బలరాం తదితరులున్నారు.

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *