GPO Assistants | జీపీవోలకు అసిస్టెంట్లను నియమించాలి..

Srinivas Kolluri

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: GPO Assistants | జిల్లాలో జీపీవోలకు అసిస్టెంట్లను నియమించాలని జీపీవో నిజామాబాద్​ జిల్లా అసోసియేట్​ అధ్యక్షుడు సంగెం పృథ్వీరాజ్​ అన్నారు. ఈ మేరకు సోమవారం ప్రకటన విడుదల చేశారు.

GPO Assistants | పనిఒత్తిడితో సతమతం..

ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం (State Government) జీపీవో వ్యవస్థను తీసుకొచ్చిందని సంగెం పృథ్వీరాజ్​ పేర్కొన్నారు. అయితే ఆయా ప్రాంతాల్లో సర్టిఫికెట్ల జారీ, భూములు తనిఖీ, ప్రభుత్వ పథకాల అమలు చేయడం జీపీవోలకు ఇబ్బందిగా మారిందన్నారు. ఒక్కరే విచారణకు వెళ్లడం.. రెవెన్యూ శాఖ (Revenue Department) నుంచి ఎలాంటి మద్దతు లేకపోవడంతో పూర్తిస్థాయిలో పనిచేయలేకపోతున్నారన్నారు. జీపీవోలకు అసిస్టెంట్లను నియమిస్తే గ్రామస్థాయిలో ప్రజలకు న్యాయం చేకూరుతుందన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి జీపీవోలకు సహాయకులను నియమించాలని కోరారు.

ఇది కూడా చదవండి..: Farmer Death Incident | బావిలో జారి పడి రైతు మృతి

 

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *