కరీంనగర్PMJ Jewellers Robbery | పీఎంజే జువెల్లరీస్​ దోపిడీ.. దొరికిన దొంగలు

PMJ Jewellers Robbery | పీఎంజే జువెల్లరీస్​ దోపిడీ.. దొరికిన దొంగలు

కరీంనగర్‌ పీఎంజే జువెల్లరీస్‌ దోపిడీ కేసులో పోలీసుల కీలక పురోగతి సాధించారు. ఇందరు నిందితులతో పాటు బంగారం కొనుగోలు చేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

అక్షరటుడే, వెబ్​డెస్క్: PMJ Jewellers Robbery | కరీంనగర్‌ (Karimnagar) పీఎంజే జువెల్లరీస్‌ దోపిడీ కేసులో పోలీసుల కీలక పురోగతి సాధించారు. ఇందరు నిందితులతో పాటు బంగారం కొనుగోలు చేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

కరీంనగర్​లోని జ్యోతినగర్​లో గల పీఎంజే జ్యువెల్లరీస్ (PMJ Jewellers)​లో ఈ నెల 3న దోపిడీ జరిగిన విషయం తెలిసిందే. దుండగులు ఉదయం పూట దుకాణంలోకి చొరబడి దోపిడీ చేశారు. సిబ్బందిపై కాల్పులు జరిపారు. అనంతరం బంగారు ఆభరణాలను తీసుకొని పరారు అయ్యారు. ఈ కేసును పోలీసులు సవాలుగా తీసుకున్నారు. ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. నిందితులు ధర్మపురి వైపు వెళ్లినట్లు గమనించారు. ధర్మపురిలోని గోదావరి తీరంలో బైక్​ను వదిలేసి దుండగులు పరారు అయ్యారు.

PMJ Jewellers Robbery | బీహార్​లో నగల విక్రయం

దోపిడీకి పాల్పడింది అంతర్రాష్ట్ర ముఠాగా పోలీసులు గుర్తించారు. రెక్కీ నిర్వహించి పక్కా ప్రణాళికతో చోరీ చేసినట్లు గుర్తించిన పోలీసులు వారి కోసం ఇతర రాష్ట్రాల్లో సైతం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో దోచుకున్న బంగారాన్ని బీహార్ (Bihar)​లో విక్రయిస్తుండగా పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. మరో ముగ్గురు నిందితుల కొసం బెంగాల్, బీహార్​లో గాలిస్తున్నారు. అరెస్ట్​పై పోలీసులు ఇంకా వివరాలు వెల్లడించలేదు. అయితే వారిని కరీంనగర్​ తీసుకొస్తున్నట్లు సమాచారం.

ఇది కూడా చదవండి..: Kaushik Reddy | నాపై హత్యాయత్నం చేశారు..: కౌశిక్​ రెడ్డి

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Transgender Protest | కలెక్టరేట్​ ఎదుట ట్రాన్స్​జెండర్ల ధర్నా.. గ్రామాల్లోకి రానివ్వడం లేదని ఫిర్యాదు

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Transgender Protest |నగరంలోని కలెక్టరేట్​ ఎదుట ట్రాన్స్​జెండర్లు...

Himanta Biswa Sharma | అస్సాం సీఎంగా రేపు హిమంత బిస్వా శర్మ ప్రమాణ స్వీకారం

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Himanta Biswa Sharma | అస్సాం ముఖ్యమంత్రిగా...

Stock Market Crash | ఆర్థిక సంక్షోభ భయాలు.. భారీ నష్టాల్లో మార్కెట్లు..

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market Crash | పశ్చిమాసియాలో మళ్లీ...

AIADMK Factionalism | అన్నాడీఎంకేలో ముసలం.. ఓటమి తర్వాత ఈపీఎస్ vs షణ్ముగం వర్గాల ఆధిపత్య పోరు!

అక్షరటుడే, వెబ్​డెస్క్ : AIADMK Factionalism | తమిళనాడు రాజకీయాల్లో ఒకప్పుడు...