అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: Girl Kidnapping Case | బాలిక కిడ్నాప్ కేసులో ఒకరికి నిజామాబాద్ (Nizamabad) న్యాయస్థానం ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. ఈ మేరకు నేరస్తుడికి శిక్ష పడేందుకు కృషి చేసిన పోలీసు సిబ్బందిని సీపీ సాయిచైతన్య అభినందించారు.
Girl Kidnapping Case | విధిలేని స్థితిలో భిక్షమెత్తుకుంటుండగా..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మద్నూర్ మండలం సలాబత్పూర్నకు చెందిన బాలాజీ గైక్వాడ్, సూర్యకాంత్ కూలీ పనిచేసుకుని బతికేవారు. అయితే వచ్చిన డబ్బులు సరిపోకపోవడంతో పిల్లలను కిడ్నాప్ చేసి విక్రయిస్తే డబ్బులు వస్తాయనే ఆలోచనతో నిజామాబాద్‌కు వచ్చారు.
నగరంలోని గాంధీచౌక్‌లో 2025 ఏప్రిల్ 6వ తేదీన అర్ధరాత్రి బీద పరిస్థితుల్లో భిక్షమెత్తుకుంటూ రాత్రివేళ రోడ్డు పక్కన తల్లితో కలిసి నిద్రిస్తున్న మూడేళ్ల బాలికను నిందితుడు సూర్యకాంత్ ఎత్తుకెళ్లాడు. అయితే తన కుమార్తె కనిపించకపోవడంతో ఆ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
పోలీసులు వెంటనే కేసు నమోదు చేసుకుని సీసీ ఫుటేజీల ఆధారంగా సూర్యకాంత్‌ను పట్టుకున్నారు. నిందితుడిని కోర్టులో హాజరుపర్చగా సాక్ష్యాధారాలను పరిశీలించిన నిజామాబాద్ జిల్లా జడ్జి జీవీఎన్ భరత లక్ష్మి.. సూర్యకాంత్‌కు ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు.
ఈ మేరకు పీపీ ధర్పల్లి రాజేశ్వర్‌రెడ్డి వివరాలు వెల్లడించారు. కేసులో నిందితుడికి శిక్షపడేలా కృషి చేసిన పోలీసు సిబ్బందిని సీపీ సాయిచైతన్య అభినందించారు.
ఇది కూడా చదవండి: స్టాక్ మార్కెట్‌లో బ్లడ్ బాత్..రూ.10 లక్షల కోట్ల సంపద ఆవిరి..!