Balkonda Cordon Search | బాల్కొండలో కార్డెన్ సెర్చ్.. వాహన భద్రతపై పలువురికి అవగాహన

బాల్కొండ మండల కేంద్రంలో గురువారం రాత్రి పోలీసుల ఆధ్వర్యంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు.

shashi kiran Mottala

అక్షరటుడే, బాల్కొండ: Balkonda Cordon Search | నిజామాబాద్​ జిల్లా బాల్కొండ మండల కేంద్రంలో (Balkonda) గురువారం రాత్రి పోలీసుల ఆధ్వర్యంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వాహన భద్రతపై పలువురికి అవగాహన కల్పించారు.

Balkonda Cordon Search |ఇంటింటికీ తిరుగుతూ..

పోలీసు బృందాలు ఇంటింటికీ తిరిగి ద్విచక్ర వాహనాలు, ఆటోలను తనిఖీ చేసి సరైన పత్రాలు లేని వాహనాలకు జరిమానాలు విధించారు. ఈ సందర్భంగా ఏసీపీ వెంకటేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రతిఒక్కరూ ద్విచక్ర వాహనాలపై వెళ్లేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

గంజాయి, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, విద్యార్థులు చెడు అలవాట్లకు లోనుకాకుండా కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీఐ జాన్‌రెడ్డి, బాల్కొండ, ముప్కాల్, మెండోరా, ఆర్మూర్ ఎస్సైలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: స్టాక్ మార్కెట్‌లో బ్లడ్ బాత్..రూ.10 లక్షల కోట్ల సంపద ఆవిరి..! 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *