POCSO Case Arrest|మైనర్ బాలిక పై లైంగిక దాడి.. జీఎస్టీ అధికారి దంపతులు అరెస్ట్

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్:POCSO Case Arrest| మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో కేంద్ర ప్రభుత్వ పరిధిలోని జీఎస్టీ (GST) సీనియర్ అసిస్టెంట్ రామ్మూర్తితో పాటు, అతనికి సహకరించిన భార్య, రైల్వే కోడూరు డిప్యూటీ తహసీల్దార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అత్యంత కలకలం రేపిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నిందితుడు రామ్మూర్తి ఒక మైనర్ బాలికను లొంగదీసుకుని లైంగిక దాడికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా బాధితురాలికి సంబంధించిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తానంటూ బ్లాక్‌మెయిల్‌కు దిగాడు. ఈ విషయం బయటకు చెబితే బాలిక తల్లిదండ్రులను సైతం చంపేస్తానంటూ తీవ్రంగా బెదిరించాడు. నిందితుడి వేధింపులు భరించలేక బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యులు చివరకు పోలీసులను ఆశ్రయించారు.

POCSO Case Arrest|‘జీరో ఎఫ్‌ఐఆర్’ ద్వారా కేసు బదిలీ..

బాధితురాలి ఫిర్యాదు మేరకు మొదట హైదరాబాద్‌లోని జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్‌లో ‘జీరో ఎఫ్‌ఐఆర్’ (Zero FIR) నమోదు చేశారు. అయితే, ఈ నేరం జరిగిన ప్రాంతం తిరుపతి పరిధిలోకి రావడంతో, జగద్గిరిగుట్ట పోలీసులు ఈ కేసును తదుపరి దర్యాప్తు నిమిత్తం తిరుపతి పోలీసులకు బదిలీ చేశారు. కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తిరుపతి(Tirupati) పోలీసులు విచారణ జరిపి, ప్రధాన నిందితుడు రామ్మూర్తిని అరెస్ట్ చేశారు. అలాగే, ఈ వ్యవహారంలో నిందితుడికి సహకరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అతని భార్య (రైల్వే కోడూరు డిప్యూటీ తహసీల్దార్‌)ను కూడా అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై పోక్సో (POCSO) చట్టంతో పాటు ఐపీసీలోని పలు తీవ్రమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.

ఇది కూడా చదవండి: ACB Raids on Deputy Collector | డిప్యూటీ కలెక్టర్​ ఇంట్లో ఏసీబీ దాడులు.. భారీగా అక్రమాస్తుల గుర్తింపు

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *