Bhagavata Saptaham | పోతంగల్‌లో వైభవంగా ‘శ్రీమద్భాగవత మహాపురాణ’ సప్తాహం

shashi kiran Mottala

అక్షరటుడే, ​కోటగిరి: Bhagavata Saptaham | పోతంగల్ (Pothangal) మండల కేంద్రంలోని శ్రీ బాలాజీ మందిరంలో జుక్కల్ (jukkal) మఠం సద్గురు గోపాల్​ మహారాజ్ రామదాసి ఆధ్వర్యంలో శ్రీమద్భాగవత మహాపురాణ సప్తాహం వైభవంగా కొనసాగుతోంది. మే16వ తేదీన మండల కేంద్రానికి చేరుకున్న గోపాల్ మహారాజ్ దంపతులకు మహిళలు మంగళహారతులతో ఘనంగా స్వాగతం పలికారు.

Bhagavata Saptaham | వారం రోజుల పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలు..

gopal

వారం రోజుల పాటు సాగే ఈ ఆధ్యాత్మిక వేడుకల్లో భాగంగా నిత్యం ఉదయం, సాయంత్రం సర్వదేవతల అభిషేకాలు, రామదాసు భిక్షాటన, భాగవత ప్రవచనాలు, సంకీర్తనలు, నిరంతర అన్నదానం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గోపాల్​ మహారాజ్​ మాట్లాడుతూ.. గోపాల్ మహారాజ్ భక్తులనుద్దేశించి ప్రసంగిస్తూ.. ప్రతిఒక్కరూ తల్లిదండ్రులు, గురువులు, గోమాతను గౌరవిస్తూ సనాతన ధర్మాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. ‘సమాజంలో ద్వేష భావనలను, కుట్రలను వీడి.. అంతా భారతీయులమనే సద్భావనతో మెలగాలన్నారు. నిష్కల్మషమైన భక్తితో దైవాన్ని స్మరిస్తే ఆ శ్రీరామచంద్రుడు ఆయురారోగ్యాలను, అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తాడని ఉద్భోదించారు.

Bhagavata Saptaham | బాలాజీ మందిరం పవిత్రం పుణ్యక్షేత్రం..

purohit

​కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల వేంకటేశ్వర స్వామి, సీతారామచంద్రుల అనుగ్రహం, 22 తరాల రామోపాసనా శక్తి రూపమే బాలాజీ మందిరమని.. భక్తులందరూ భక్తిమార్గంలో పయనించి తరించాలని ఆయన కోరారు. అనంతరం ​శ్రీకర్ మహారాజ్ తన అనుభవాలను పంచుకుంటూ.. గోపాల్​ మహరాజ్​ తొమ్మిదేళ్ల వయసులోనే గ్రామాన్ని వదిలి వెళ్లారని.. అనంతరం జుక్కల్‌లో గోవింద మఠాన్ని ఏర్పాటు చేసుకున్నారన్నారు. తన జన్మస్థలమైన పోతంగల్ గ్రామంలో ఈ భాగవత సప్తాహాన్ని ఆయన పోతంగల్​లో నిర్వహించడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు.

Bhagavata Saptaham | ​ఘనంగా శ్రీరామ పట్టాభిషేకం..

​అధిక మాసం (పురుషోత్తమ మాసం) పురస్కరించుకుని శుక్రవారం స్వామివారికి వైభవంగా పట్టాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు పట్టాభిషేకంలో పాల్గొన్న పురోహితులకు 33 రకాల వస్తువులతో కూడిన దానం చేశారు. శనివారం జరగబోయే ముగింపు ఉత్సవాల్లో భాగంగా ‘లలితా పారాయణం’ (Lalita Parayana) నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ​జుక్కల్ మఠం శిష్యులతో పాటు గోపాల్, కేశవ్ నానా, శ్రీకర్ మహారాజ్ పర్యవేక్షణలో జరుగుతున్న ఈ కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కమిటీ పేర్కొంది.

ఇది కూడా చదవండి: Telangana Farmers Protest| తక్షణమే ధాన్యాన్ని సేకరించాలి.. కవిత డిమాండ్

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *