అక్షరటుడే వెబ్‌డెస్క్:Cockroach Janata Party|సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో(Instagram) ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) ఊహించని రేంజ్‌లో దూసుకుపోతోంది. నెటిజన్ల నుంచి లభిస్తున్న భారీ మద్దతుతో ఈ పేజీ ఏకంగా 20.2 మిలియన్ల (2 కోట్లకు పైగా) ఫాలోవర్ల మైలురాయిని అందుకొని సరికొత్త రికార్డు సృష్టించింది.
Cockroach Janata Party|అసలు ఈ ట్రెండ్ ఎందుకు మొదలైందంటే?
ఇటీవల కొందరు యువ విమర్శకులను ఉద్దేశించి భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) చేసిన ‘కాక్రోచ్’ (బొద్దింక) వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఆ వ్యాఖ్యలకు డిజిటల్ రూపంలో నిరసన తెలియజేస్తూ నెటిజన్లు ఇన్‌స్టాగ్రామ్‌లో ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) అనే వ్యంగ్య (Satire) పేజీని ప్రారంభించారు.
Cockroach Janata Party|నెట్టింట ‘జెన్ జీ’ హల్‌చల్..
ప్రస్తుతం ఈ పేజీ యువతను విశేషంగా ఆకట్టుకుంటోంది. యువత తామే ఈ పార్టీ తరపున కాబోయే సీఎం, ఎమ్మెల్యే అభ్యర్థులమంటూ వినూత్నంగా వీడియోలు, మీమ్స్, పోస్టులు పెడుతూ నెట్టింట ట్రెండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ఈ కాక్రోచ్ పార్టీ ట్రెండ్‌కు పోటీగా సోషల్ మీడియాలో ‘హిట్ జనతా పార్టీ’ (HIT Janta Party) అనే మరో సరికొత్త పేజీ కూడా పుట్టుకొచ్చింది. (సాధారణంగా ఇళ్లలో బొద్దింకలను చంపడానికి ‘హిట్’ స్ప్రే వాడతారనే వ్యంగ్యార్థంతో దీనిని ప్రారంభించారు). ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ రెండు గ్రూపుల మధ్య నడుస్తున్న మీమ్స్ వార్ నెటిజన్లకు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను ఇస్తోంది.
ఇది కూడా చదవండి: Bhagavata Saptaham | పోతంగల్‌లో వైభవంగా ‘శ్రీమద్భాగవత మహాపురాణ’ సప్తాహం


