Parliament Deadlock | అమిత్ షా ప్రకటన వచ్చే వరకు పార్లమెంట్‌లో డెడ్‌లాక్ వీడదు: ప్రియాంక గాంధీ

విద్యార్థులపై పోలీసుల దౌర్జన్యాల ఆరోపణలపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పార్లమెంట్‌లో ప్రకటన చేసే వరకు ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య డెడ్‌లాక్ వీడదని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా స్పష్టం చేశారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Parliament Deadlock | విద్యార్థులపై పోలీసుల దౌర్జన్యాల ఆరోపణలపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పార్లమెంట్‌లో ప్రకటన చేసే వరకు ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య డెడ్‌లాక్ వీడదని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా ( Priyanka Gandhi )స్పష్టం చేశారు. హోంశాఖ మంత్రి స్వయంగా ప్రకటన చేస్తేనే సభ సజావుగా సాగుతుందని ఆమె తేల్చి చెప్పారు.

Parliament Deadlock | కీలక బిల్లుల భవితవ్యం అనిశ్చితిలో..

వర్షాకాల సమావేశాలు ముగియడానికి కేవలం నాలుగు రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈ తరుణంలో తీవ్ర నిరసనల నడుమ మహిళా రిజర్వేషన్, నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్), విదేశీ నిధుల క్రమబద్ధీకరణ సవరణ చట్టం (FCRA) వంటి కీలక బిల్లుల భవితవ్యం అనిశ్చితిలో పడింది. సోమవారం లోక్‌సభ అజెండా జాబితాలో కూడా ఈ బిల్లులకు చోటు దక్కలేదు. ప్రభుత్వం జరిపిన చర్చల తర్వాత మహిళా కోటా, డీలిమిటేషన్ బిల్లులపై కొన్ని ప్రతిపక్షాలు కొంత మెత్తబడినప్పటికీ.. కాంగ్రెస్ , దాని మిత్రపక్షాలు మాత్రం ఎఫ్‌సిఆర్‌ఎ (FCRA) సవరణ బిల్లుతో సహా ఇతర బిల్లులను గట్టిగా అడ్డుకోవాలని నిర్ణయించాయి.

Parliament Deadlock | ఎఫ్‌సిఆర్‌ఎ బిల్లుపై తీవ్ర వ్యతిరేకత..

ఎన్‌జీఓలు, మైనారిటీ సంస్థలను లక్ష్యంగా చేసుకుని తెస్తున్న ఎఫ్‌సిఆర్‌ఎ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని, ప్రజా వ్యతిరేకమని ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ విమర్శించారు. ఒకవేళ కేంద్రం బలవంతంగా ఈ బిల్లును ఆమోదింపజేయాలని చూస్తే పార్లమెంట్‌లో తీవ్ర నిరసనలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. విదేశీ నిధులు పొందే సంస్థలపై కఠిన ఆంక్షలు విధించేలా రూపుదిద్దుకున్న ఈ బిల్లును పలు క్రైస్తవ సంస్థలు, రాజకీయ పక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

Parliament Deadlock | వర్షాకాల సమావేశాల తీరు..

గత జులై 20న ప్రారంభమైన ఈ వర్షాకాల సమావేశాలు ప్రతిపక్షాల వరుస నిరసనలు, వాయిదాల నడుమ దాదాపు స్తంభించిపోయాయి. పోటీ పరీక్షల అక్రమాల నిరోధక సవరణ బిల్లు-2026తో పాటు కొన్ని చిన్న బిల్లులు మాత్రమే ఎలాంటి చర్చ లేకుండా ఆమోదం పొందాయి.

ఇది కూడా చదవండి: Sriramsagar Water Storage | ఎస్సారెస్పీకి తగ్గుతున్న వరద.. 42.116 టీఎంసీలకు చేరిన నీటి నిల్వ

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *