Skip to content
Akshara Today
  • Home
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • నల్గొండ
    • ఖమ్మం
    • మహబూబ్‌నగర్
  • సినిమా
  • More..
    • క్రైం
    • బ్లాగ్
    • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
    • టెక్నాలజీ
    • క్రీడలు
    • బిజినెస్​
    • భక్తి
    • లైఫ్​ స్టైల్​
Subscribe
  • 🔥
  • జిల్లాలు
  • హైదరాబాద్
  • సినిమా
  • లైఫ్​ స్టైల్​
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • బ్లాగ్
  • బిజినెస్​
  • భక్తి
  • టెక్నాలజీ
Akshara TodayAkshara Today
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • హైదరాబాద్
  • నిజామాబాద్
  • సినిమా
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • క్రీడలు
  • క్రైం
  • టెక్నాలజీ
  • ఫ్యాషన్
  • బిజినెస్​
  • బ్లాగ్
  • భక్తి
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • లైఫ్​ స్టైల్​
Search
  • Pages
    • Home
    • Blog Index
    • Contact Us
    • Search Page
    • 404 Page
  • Personalized
    • My Feed
    • My Saves
    • My Interests
    • History
  • Categories
Follow US

Home - జాతీయం

జాతీయం

Princeton Trademark Dispute | ‘ప్రిన్స్‌టన్’ పేరు వివాదం.. విద్యాసంస్థలకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

Shivam nagarani
Last updated: June 3, 2026, 3:50 pm 3:50 pm
Shivam nagarani
Share
Princeton Trademark Dispute

అక్షరటుడే వెబ్‌డెస్క్: Princeton Trademark Dispute | తెలంగాణలో ‘ప్రిన్స్‌టన్’ పేరుతో నడుస్తున్న విద్యాసంస్థలకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అమెరికాలోని ప్రసిద్ధ ‘ప్రిన్స్‌టన్ విశ్వవిద్యాలయం’ (Princeton University)తో తమకు ఎలాంటి సంబంధం లేదనే విషయాన్ని విద్యార్థులకు, ప్రజలకు స్పష్టంగా తెలిసేలా ప్రముఖంగా ప్రకటించాలని స్పష్టం చేసింది. వాగ్దేవి ఎడ్యుకేషనల్ సొసైటీతో పాటు ఇతరులు నడుపుతున్న ఆరు విద్యాసంస్థలపై దాఖలైన ట్రేడ్‌మార్క్ వివాదం అప్పీళ్లను విచారించిన జస్టిస్ పి.వి. సంజయ్ కుమార్, జస్టిస్ కె. వినోద్ చంద్రన్‌ల ధర్మాసనం ఈ ఉత్తర్వులు ఇచ్చింది.

Princeton Trademark Dispute | గందరగోళం వద్దు..

అంతర్జాతీయంగా ఎంతో గుర్తింపు ఉన్న ఐవీ లీగ్ సంస్థ అయిన ప్రిన్స్‌టన్ విశ్వవిద్యాలయానికి ట్రేడ్‌మార్క్ చట్టం ప్రకారం రక్షణ పొందే హక్కు ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది. తెలంగాణలోని సంస్థలు కూడా అదే పేరు వాడటం వల్ల, అమెరికా వర్సిటీతో వీటికి ఏదో సంబంధం ఉందేమోనని విద్యార్థులు, ప్రజలు పొరపాటు పడే అవకాశం ఉందని కోర్టు అభిప్రాయపడింది. అందుకే విద్యార్థుల ప్రయోజనాలను కాపాడేందుకు కొన్ని కఠిన నిబంధనలు విధించింది.

suprim 1

Princeton Trademark Dispute | సుప్రీంకోర్టు విధించిన కీలక షరతులు..

ఆరు విద్యాసంస్థలు తమ అధికారిక వెబ్‌సైట్లు, బ్రోచర్లు, ప్రచార సామగ్రిలో ‘అమెరికా ప్రిన్స్‌టన్ వర్సిటీతో మాకు సంబంధం లేదు’ అనే నిరాకరణ ప్రకటనను (Disclaimer) స్పష్టంగా పెట్టాలి. ముఖ్యంగా వెబ్‌సైట్లలో వాడే అన్నిటికంటే పెద్ద ఫాంట్ సైజులోనే ఈ ప్రకటన కనిపించాలి. జూన్ 1 నుంచి 12వ తేదీ వరకు ఒక రోజు మార్చి ఒక రోజు ప్రముఖ దినపత్రికలలో పావు పేజీ (Quarter Page) సైజులో ఈ విషయమై బహిరంగ ప్రకటనలు ఇవ్వాలి. కాలేజీల బయట పెద్ద డిస్‌ప్లే బోర్డులు ఏర్పాటు చేయడంతో పాటు, విద్యార్థులకు ఇచ్చే సర్టిఫికెట్లు, మార్క్స్ మెమోలపై కూడా ఈ నిరాకరణ ప్రకటనను పెద్ద అక్షరాలతో ముద్రించాలి. వచ్చే విద్యాసంవత్సరం అడ్మిషన్ల ప్రక్రియ మొదలయ్యేలోపే ఈ ఆదేశాలన్నింటినీ అమలు చేయాలని కోర్టు గడువు విధించింది.

suprim.1 1

Princeton Trademark Dispute | వివాదం ఎక్కడ మొదలైంది?

తెలంగాణ సంస్థలు 1991 నుంచి ‘ప్రిన్స్‌టన్’ పేరుతో ఇక్కడే సేవలందిస్తున్నందున, వాటిని పూర్తిగా మూసివేయించడం సరికాదని గతంలో ఢిల్లీ హైకోర్టు డివిజన్ బెంచ్ పేర్కొంది. అయితే కొత్తగా ఈ పేరుతో ఎలాంటి సంస్థలు పెట్టకూడదని అప్పట్లో స్పష్టం చేసింది. ఈ మధ్యంతర ఉపశమనంపై అసంతృప్తితో అమెరికా ప్రిన్స్‌టన్ వర్సిటీ సుప్రీంకోర్టును ఆశ్రయించగా, తెలంగాణ సంస్థలు కూడా హైకోర్టు ఆదేశాలను సవాలు చేశాయి. చివరకు రెండు వైపులా వాదనలు విన్న అత్యున్నత న్యాయస్థానం.. కేసు పూర్తిగా తేలేవరకు ప్రస్తుతానికి పాత పేరుతో కొనసాగేందుకు అనుమతిస్తూనే, ప్రజలు మోసపోకుండా ఉండటానికి ఈ అదనపు ఆంక్షలను విధించింది. ఈ ట్రేడ్‌మార్క్ ఉల్లంఘన కేసు ప్రస్తుతం ఢిల్లీ హైకోర్టులో విచారణలో ఉంది.

ఇది కూడా చదవండి: Delhi Restaurant Fire | ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం.. 20 మంది మృతి

TAGGED:education newsIndia Supreme Courtlatest newslegal newsPrinceton Trademark DisputePrinceton UniversitySupreme Court IndiaTelangana educationtelugu newsTrademark Case
ByShivam nagarani
Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Previous Article Hyderabad Tanker Accident Hyderabad Tanker Accident | మేడిపల్లి వద్ద పిల్లర్‌ను ఢీ కొట్టిన పెట్రోల్ ట్యాంకర్.. తృటిలో తప్పిన ప్రమాదం
Next Article State Finance Commission State Finance Commission | స్టేట్​ ఫైనాన్స్​ కమిషన్​ ఛైర్మన్​ నియామకం
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Your Trusted Source for Accurate and Timely Updates!

Our commitment to accuracy, impartiality, and delivering breaking news as it happens has earned us the trust of a vast audience. Stay ahead with real-time updates on the latest events, trends.
FacebookLike
XFollow
InstagramFollow
LinkedInFollow
MediumFollow
QuoraFollow
- Advertisement -
Ad image

You Might Also Like

Rajnath Singh Statement
జాతీయం

Rajnath Singh Statement | భారత్ ఐటీ హబ్ అయితే.. పాక్ ఉగ్రవాదానికి హబ్ : రాజ్‌నాథ్ సింగ్

By Shashi kiran Mottala
RBI Repo Rate
బిజినెస్​

RBI Repo Rate | ఆర్‌బీఐ కీలక నిర్ణయం.. వడ్డీ రేట్లు యథాతథం

By Shivam nagarani
Sudha Reddy Met Gala
తెలంగాణఅంతర్జాతీయంజాతీయం

Sudha Reddy Met Gala | మెట్ గాలాలో సుధా రెడ్డి.. రూ. 140 కోట్ల టాంజానైట్ నెక్లెస్‌తో మెరుపులు!

By Naresh Chandan
Saudi Job Scam
తెలంగాణ

Saudi Job Scam|సౌదీ ఎడారిలో జగిత్యాల యువకుడి నరకయాతన.. ‘నన్ను కాపాడండి’ అంటూ సెల్ఫీ వీడియో వైరల్

By Shivam nagarani
Akshara Today
Facebook Youtube Instagram X-twitter

About US

అక్షర టుడే – తాజా తెలుగు వార్తలు, బ్రేకింగ్ న్యూస్..

తెలంగాణ,, ఆంధ్రప్రదేశ్తో పాటు జాతీయం, అంతర్జాతీయానికి సంబంధించిన తాజా తెలుగు వార్తలు, రాజకీయాలు, సినిమా, క్రీడలు మరియు ముఖ్యమైన విశేషాలను ‘అక్షరటుడే’లో చదవండి.

.

Top Links
  • About Us
  • Contact Us
  • Advertise With Us
Usefull Links
  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

© Akshara Today 2026. All Rights Reserved.