ఆంధ్రప్రదేశ్​Visakhapatnam Infrastructure Funds|విశాఖలో 3 భారీ ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

Visakhapatnam Infrastructure Funds|విశాఖలో 3 భారీ ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

విశాఖపట్నం నగరంలో మౌలిక వసతుల ఆధునీకరణ, పట్టణాభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం సుమారు రూ. 1,501.03 కోట్ల భారీ నిధులను మంజూరు చేసింది.

అక్షరటుడు వెబ్‌డెస్క్:Visakhapatnam Infrastructure Funds|విశాఖపట్నం(Visakhapatnam) నగరంలో మౌలిక వసతుల ఆధునీకరణ, పట్టణాభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం సుమారు రూ. 1,501.03 కోట్ల భారీ నిధులను మంజూరు చేసింది. గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (GVMC) ప్రతిపాదించిన మూడు కీలక ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వానికి చెందిన నేషనల్ అపెక్స్ కమిటీ (NAC) ఆమోదం తెలిపినట్లు విశాఖ ఎంపీ శ్రీభరత్ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ అర్బన్ ఛాలెంజ్ ఫండ్ (UCF) పథకం కింద ఈ నిధులు విడుదల కానున్నాయి.

Visakhapatnam Infrastructure Funds|మధురవాడ జోన్‌లో ..

ఈ నిధులలో అత్యధికంగా రూ. 725.18 కోట్లను మధురవాడ జోన్‌లో అత్యాధునిక స్మార్ట్ తాగునీటి సరఫరా వ్యవస్థ ఏర్పాటు కోసం కేటాయించారు. అలాగే, అదే మధురవాడ జోన్ పరిధిలో భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థను (అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్) సమగ్రంగా అభివృద్ధి చేయడానికి రూ. 658.61 కోట్లను, నగరవ్యాప్తంగా ఉన్న బల్క్ & సెమీ బల్క్ తాగునీటి సరఫరా లైన్లను ఆధునీకరించడం కోసం మరో రూ. 117.24 కోట్లను ఖర్చు చేయనున్నారు.

Visakhapatnam Infrastructure Funds|పెరగనున్న ప్రజల జీవన ప్రమాణాలు..

ఈ మూడు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు అందుబాటులోకి రావడం వల్ల విశాఖపట్నం నగర పౌర మౌలిక సదుపాయాలు మరింత బలోపేతం కావడమే కాకుండా, పెరుగుతున్న నగర జనాభా అవసరాలకు అనుగుణంగా ప్రజల జీవన ప్రమాణాలు, ఆరోగ్యం ఎంతో మెరుగుపడతాయని ఎంపీ శ్రీభరత్ ధీమా వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి: Oil Tankers in Hormuz | భారత్ సాహసం.. హార్ముజ్ జలసంధిలోకి చమురు నౌకలు!

Shivam nagarani
Shivam nagaranihttps://aksharatodaynews.com/
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Tirumala Devotee Rush| తిరుమలలో పెరిగిన రద్దీ.. రేపటి వరకు క్యూలైన్లకు రావొద్దని విజ్ఞప్తి

అక్షరటుడే వెబ్‌డెస్క్:Tirumala Devotee Rush|వేసవి సెలవుల కారణంగా తిరుమలకు(Tirumala) భక్తులు భారీగా...

Hyderabad Fire Accident | హైదరాబాద్​లో మరో అగ్ని ప్రమాదం

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Hyderabad Fire Accident | హైదరాబాద్​ నగరంలో గురువారం...

Stock Market Gains | లాభాల్లో మార్కెట్లు..

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Stock Market Gains | పశ్చిమాసియాలో నాటకీయ పరిణామాలు...

Chandrababu Convoy | సీఎం చంద్రబాబు కాన్వాయ్‌లో కొత్త మార్పులు.. భద్రత కోసం రెండు మినీ బస్సులు

అక్షరటుడే, వెబ్​డెస్క్: Chandrababu Convoy | ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రి...