Hyderabad Fire Accident | హైదరాబాద్​లో మరో అగ్ని ప్రమాదం

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Hyderabad Fire Accident | హైదరాబాద్​ నగరంలో గురువారం ఉదయం మరో అగ్ని ప్రమాదం (Fire Accident) చోటు చేసుకుంది. పాతబస్తీలోని మదీనా ‘X’ రోడ్డు వద్ద ఉన్న ఒక పిల్లల వస్త్రదుకాణంలో భారీగా మంటలు చెలరేగాయి.

ఓల్డ్​ సిటీలో రద్దీగా ఉండే మదీనా కూడలి సమీపంలో ఉన్న ఒక ప్రముఖ దుకాణంలో అగ్ని ప్రమాదం జరిగింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసి పడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో అగ్ని మాపక సిబ్బంది 8 ఫైర్​ ఇంజిన్​లతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేసుకొని పరిశీలించారు. వివరాలు తెలుసుకున్నారు. అయితే అగ్ని ప్రమాదానికి గల కారణం తెలియరాలేదు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం.

Hyderabad Fire Accident | వరుస ప్రమాదాలు

వేసవి ప్రారంభం నుంచి హైదరాబాద్​ (Hyderabad) నగరంలో అనేక అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా బట్టలు దుకాణాలు, ఫర్నీచర్​ షాపుల్లో మంటలు ఎక్కువగా అంటుకున్నాయి. గతంలో నాంపల్లిలోని బచ్చాస్​ ఫర్నిచర్​ దుకాణంలో అగ్ని ప్రమాదం జరిగి ఐదుగురు సజీవ దమనం అయ్యారు. ఇటీవల మేడ్చల్​లోని ఓ కెమికల్​ కంపెనీలో అగ్ని ప్రమాదం జరిగింది. నిత్యం ప్రమాదాలు చోటు చేసుకుంటున్నా.. అధికారులు చర్యలు తీసుకోవడం లేదు.

Hyderabad Fire Accident | పైర్​ సేఫ్టి నిబంధనలు లేక అగ్ని ప్రమాదాలు

గతంలో బచ్చాస్​ ఫర్నిచర్​ మాల్ ఘటన తర్వాత హైడ్రా, జీహెచ్​ఎంసీ, అగ్ని మాపక శాఖ అధికారులు హడావుడి చేశారు. నాలుగు రోజుల పాటు పెద్ద పెద్ద దుకాణాల్లో తనిఖీలు చేశారు. అగ్ని మాపక శాఖ నిబంధనలు పాటించిన దుకాణాలను సీజ్​ చేశారు. అయితే తర్వాత పట్టించుకోవడం మానేశారు. దీంతో అనేక భవనాల్లో పైర్​ సేఫ్టి నిబంధనలు లేక అగ్ని ప్రమాదాలు జరిగి భారీగా ఆస్తి నష్టం వాటిల్లుతోంది.

ఇది కూడా చదవండి..: Hyderabad Metro | హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేజ్​కు కేంద్రం గ్రీన్​ సిగ్నల్​

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *