అక్షరటుడే, హైదరాబాద్: Rohith Reddy Bail | సంచలనం సృష్టించిన మొయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసులో వికారాబాద్ జిల్లా (Vikarabad District) తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. గత 45 రోజులుగా సాగుతున్న ఈ వివాదంలో రోహిత్ రెడ్డికి ఎట్టకేలకు న్యాయస్థానం నుంచి ఉపశమనం లభించింది.
Rohith Reddy Bail | హైకోర్టు కీలక ఆదేశాలు:
బెయిల్ మంజూరు చేసిన సందర్భంగా హైకోర్టు (High Court) పలు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రతిరోజూ దర్యాప్తు అధికారి ఎదుట హాజరుకావాలని స్పష్టం చేసింది. నిందితుడు తన పాస్‌పోర్టును పోలీసులకు అప్పగించాలని కోర్టు ఆదేశించింది. కేసు విచారణకు పూర్తిస్థాయిలో సహకరించాలని, సాక్షులను ప్రభావితం చేయడం లేదా సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నాలు చేయకూడదని హెచ్చరించింది.
Rohith Reddy Bail | అసలు ఏం జరిగిందంటే?
మార్చి 14న మొయినాబాద్ (Moinabad)లోని ఓ ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ జరుగుతున్నట్లు సమాచారం రావడంతో ఎస్‌వోటీ పోలీసులు (SOT Police) మెరుపు దాడులు చేశారు. ఈ తనిఖీల్లో డ్రగ్స్ లభించడంతో పాటు, పోలీసులపై కాల్పులు జరిపేందుకు నిందితులు ప్రయత్నించారనే ఆరోపణలపై రోహిత్ రెడ్డి సహా ఆయన సోదరుడు, మరో వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.
ఈ కేసులో గతంలో ఉప్పర్‌పల్లి కోర్టు బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించడంతో రోహిత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ నెల 8న ముగిసిన వాదనల అనంతరం హైకోర్టు ఇవాళ తన తుది ఉత్తర్వులను వెలువరించింది. ఈ నిర్ణయంతో చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న రోహిత్ రెడ్డి విడుదల మార్గం సుగమమైంది.
ఇది కూడా చదవండి..: Ashu Reddy Case | రూ. 9.35 కోట్ల మోసం కేసు.. హైకోర్టును ఆశ్రయించిన నటి అషు రెడ్డి!


[…] […]