తెలంగాణKTR Leadership | గులాబీ శ్రేణుల 'తారక'మంత్రం.. బీఆర్ఎస్ సుప్రీం లీడర్‌గా కేటీఆర్‌కు గ్రీన్ సిగ్నల్

KTR Leadership | గులాబీ శ్రేణుల ‘తారక’మంత్రం.. బీఆర్ఎస్ సుప్రీం లీడర్‌గా కేటీఆర్‌కు గ్రీన్ సిగ్నల్

బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం సందర్భంగా 25 ఏళ్ల ఆ ఉద్యమ పార్టీలో కీలక మలుపులు చోటుచేసుకున్నాయి.

అక్షరటుడే, హైదరాబాద్: KTR Leadership | బీఆర్ఎస్ పార్టీ (BRS Party) ఆవిర్భావం సందర్భంగా 25 ఏళ్ల ఆ ఉద్యమ పార్టీలో కీలక మలుపులు చోటుచేసుకున్నాయి. రెండు దశాబ్దాలకు పైగా పార్టీని ఏకఛత్రాధిపత్యంగా నడిపించిన బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (KCR), ఇప్పుడు తన వారసుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీ రామారావుకు పార్టీ పగ్గాలను దాదాపు పూర్తిస్థాయిలో అప్పగించారు.

పార్టీ అంతర్గత సమావేశాల అనంతరం వెలువడిన ఈ పరిణామంతో గులాబీ కోటలో ‘రామ’ శకం అధికారికంగా ప్రారంభమైంది. కేవలం వర్కింగ్ ప్రెసిడెంట్‌గానే కాకుండా, పార్టీకి సంబంధించిన ప్రతి కీలక నిర్ణయంలోనూ కేటీఆరే (KTR) సుప్రీం అనే స్పష్టమైన సంకేతాలు శ్రేణులకు అందాయి.

KTR Leadership | పార్టీలోని అన్ని స్థాయిల్లో..

మారుతున్న రాజకీయ సమీకరణాల దృష్ట్యా కేసీఆర్ ఒక వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఆయన ఇకపై కేవలం మార్గనిర్దేశకుడిగా ఉంటూ, జాతీయ రాజకీయాలు , రాష్ట్రస్థాయి విధానపరమైన నిర్ణయాలకే పరిమితం కానున్నారు. పార్టీ దైనందిన నిర్వహణ, నియోజకవర్గాల వారీగా క్షేత్రస్థాయి సమీక్షలు, కేడర్‌ను సమాయత్తం చేయడం , ఎన్నికల వ్యూహరచన వంటి పూర్తి బాధ్యతలను కేటీఆర్ భుజాన వేశారు. దీనివల్ల పార్టీలో అధికార కేంద్రీకరణ కేటీఆర్ వద్దే ఉంటుందని, ఆయన మాటే ఫైనల్ అని స్పష్టమైంది.

KTR Leadership | పార్టీకి పూర్వవైభవం దిశగా..

రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న రాజకీయ వాతావరణంలో పార్టీని మళ్లీ గాడిలో పెట్టేందుకు కేటీఆర్ దూకుడు, ఆయన వాగ్ధాటి అత్యవసరమని అధిష్టానం భావిస్తోంది. సోషల్ మీడియాలో బలమైన పట్టు, యువతను ఆకర్షించే శైలి కలిగిన కేటీఆర్ నాయకత్వం పార్టీకి పూర్వవైభవం తెస్తుందని కార్యకర్తలు ఆశిస్తున్నారు. రాబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు సహా, జీహెచ్‌ఎంసీ ఎన్నికల వరకు అభ్యర్థుల ఎంపిక, ప్రచార సరళి అంతా కేటీఆర్ మార్క్ వ్యూహాలతోనే సాగనుంది.

KTR Leadership | ముందున్న సవాళ్లు..

పార్టీ సర్వాధికారిగా బాధ్యతలు చేపట్టిన కేటీఆర్ ముందు అనేక సవాళ్లు ఉన్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ (Congress Party) ఎత్తుగడలను సమర్థవంతంగా తిప్పికొట్టడం, చేజారిన ముఖ్య నేతలను తిరిగి పార్టీలోకి రప్పించడం , పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడం ఇప్పుడు ఆయన ప్రాధాన్యతలు. ఇందుకోసం కేటీఆర్ ‘ఆపరేషన్ రీ-బిల్డ్’ పేరుతో జిల్లాల పర్యటనలకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా పాదయాత్ర చేస్తానని కేటీఆర్ ఇది వరకే ప్రకటించారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల కేడర్‌ను రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సమాయాత్తం చేస్తూ ఆయన నిర్ణయాలు ఉండనున్నాయి. ఇక ఈ ప్రయాణంలో బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు (Harish Rao) పాత్ర ఎలా ఉంటుందో వేచి చూడాలి. మొత్తానికి, బీఆర్ఎస్ అంటే కేసీఆర్ అనే ముద్ర నుంచి కేటీఆర్ అనే కొత్త అధ్యాయం మొదలైంది. రాబోయే రోజుల్లో కేటీఆర్ తన సొంత వ్యూహాలతో తెలంగాణ రాజకీయ ముఖచిత్రాన్ని వేచి చూడాల్సిందే.

ఇది కూడా చదవండి..: CCTV Hacking Allegations | మా సీసీ కెమెరాలు హ్యాక్​ చేస్తున్నారు.. హరీశ్​రావు సంచలన వ్యాఖ్యలు

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

April 30 Gold Rates | మ‌రింత త‌గ్గుతున్న బంగారం ధ‌ర‌.. కొనుగోలుదారులకు ఊరట!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: April 30 Gold Rates | అంతర్జాతీయ మార్కెట్‌లో...

April 30 Horoscope | సమాజంలో పెరగనున్న కీర్తి ప్రతిష్ఠలు.. ఈ రాశుల వారి వ్యక్తిత్వానికి ఫిదా అవ్వాల్సిందే!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: April 30 Horoscope | ఇవాళ గ్రహ గతులను బట్టి...

Harish Rao TRS row | TRS పేరుతో హరీష్ రావు సొంత పార్టీ!..ఇది కొత్త వ్యూహమా..?

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Harish Rao TRS row | తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర...

Sridip Success Story | తండ్రి మరణంతో కన్నీటి చుక్కలు రాసిన అక్షరాల విజయగాథ!

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Sridip Success Story | పరీక్ష హాలులో ప్రశ్నపత్రాన్ని...