అక్షరటుడే, ఇందూరు: Nizamabad Development Fund | నియోజకవర్గ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ ఫండ్ ఇవ్వాలని, ఇప్పటికే అనేకసార్లు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ (MLA Dhanpal) సూర్యనారాయణ తెలిపారు. నగరంలోని 26వ డివిజన్లో చేపట్టే రోడ్డు పనులకు భూమి పూజ చేశారు.
Nizamabad Development Fund | డివిజన్‌కు రూ.20లక్షలు..
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత ఏడాది కార్పొరేషన్లో పాలక వర్గం లేకపోవడం, కౌన్సిల్ సమావేశం జరగకపోవడంతో నిధులు లేవన్నారు. ఇటీవల జరిగిన కౌన్సిల్ సమావేశంలో ప్రతి డివిజన్‌కు రూ. 20 లక్షలు కేటాయించారన్నారు. వీటితో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు అలాగే ప్రతి డివిజన్‌కు రూ.కోటి పనులు కూడా ప్రారంభమవుతున్నాయని తెలిపారు. అర్బన్ చాలెంజ్ ఫండ్, ఖిల్లా రామాలయంలో రోప్ వేకు డీపీఆర్ కూడా సిద్ధమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ కూరగాయల ఉమారాణి, కార్పొరేటర్ బంటు రాము, బంటు ప్రీతి ప్రవీణ్, జ్యోతి మురళి, మారావార్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: SRSP Water Release | ఎస్సారెస్పీ వరద కాలువ ద్వారా నీటి విడుదల