Advocates Protection Act | అమలులోకి తెలంగాణ న్యాయవాదుల రక్షణ చట్టం

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Advocates Protection Act | రాష్ట్ర ప్రభుత్వం (State Government) న్యాయవాదులకు గుడ్​న్యూస్​ చెప్పింది. వారి కోసం న్యాయవాదుల సంరక్షణ చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం నేటి నుంచి అమలులోకి వచ్చింది. ఈ మేరకు న్యాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

రాష్ట్రంలో న్యాయవాదుల భద్రత కోసం ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. ఇటీవల న్యాయవాదులపై దాడులు జరుగుతుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో హైకోర్టు (High Court) న్యాయవాదులు వామన్​రావు దంపతులు దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఇటీవల హైదరాబాద్ (Hyderabad)​లో ఖాజా మొయినుద్దీన్​ అనే అడ్వొకేట్​ను కారు ఢీకొట్టి హత్య చేశారు. అంతేగాకుండా గతంలో పలువురు న్యాయవాదులపై దాడులు జరిగాయి. దీంతో తమ కోసం ప్రత్యేక చట్టం తీసుకు రావాలని కొన్ని రోజులుగా న్యాయవాదులు డిమాండ్​ చేస్తున్నారు. ఈ మేరకు తాజాగా ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది. ఈ మేరకు గవర్నర్​ పేరుతో గెజిట్ విడుదల అయింది.

Advocates Protection Act | కఠిన శిక్షణ

Advocates Protection Act

కొత్త చట్టం అమలుతో న్యాయవాదుల హక్కులకు, వారి వృత్తిపరమైన భద్రతకు బలం చేకూరనుంది. లాయర్లపై దాడులకు పాల్పడితే ఈ చట్టం ప్రకారం కఠిన చర్యలు ఉంటాయి. న్యాయవాదులపై దాడి లేదా హింసకు పాల్పడే వారికి 6 నెలల నుంచి మూడేళ్ల వరకు జైలు శిక్ష, కనీసం రూ. 25 వేల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. ఒకవేళ నేరం పునరావృతం అయితే ఈ శిక్ష ఒకటి నుంచి ఏడేళ్ల వరకు పొడిగిస్తారు. ఈ చట్టం ప్రకారం న్యాయవాదులను అరెస్ట్ చేయాలంటే పోలీసులు ముందుగా కోర్టు నుంచి అనుమతి తీసుకోవాలి.

Advocates Protection Act | ప్రత్యేక చట్టాలు ఎందుకు!

ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలు చట్టాలు అమలులో ఉన్నాయి. నేరాలకు పాల్పడే వారికి శిక్షలు విధించేందుకు బీఎన్​ఎస్​, బీఎన్​ఎస్​ఎస్​ చట్టాలను కేంద్రం తీసుకొచ్చింది. సామాన్యులపై దాడులు జరిగినా, ఇతర నేరాలకు గురైనా ఈ చట్టాల ప్రకారం శిక్షలు వేస్తారు. అయితే సమాజంలో కొన్ని వృత్తి వర్గాల కోసం ప్రత్యేకంగా ప్రభుత్వాలు చట్టాలు తీసుకు వస్తున్నాయి. చట్టం అందరికీ సమానం అయినప్పుడు మళ్లీ ప్రత్యేక చట్టాలు ఎందుకు అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుత రోజుల్లో సామాన్యులపైనే ఎక్కువగా దాడులు జరుగుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు, పోలీసులు, న్యాయవాదులు బెదిరింపులకు పాల్పడిన ఘటనలు ఉన్నాయి. కొంతమంది లంచాల పేరిట ప్రజలను వేధించిన సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో సామాన్యులకు రక్షణగా ప్రత్యేక చట్టాల ఉండాల్సి ఉండగా.. ఇప్పటికే సమాజంలో పలుకుబడి కలిగిన వారి కోసం ప్రత్యేక చట్టాలు తీసుకు వస్తుండటం గమనార్హం.

ఇది కూడా చదవండి..: Pawan Kalyan Farmhouse | యూట్యూబ్ బ్లాక్‌మెయిల్ దందా.. పవన్ ఆస్తిపై తప్పుడు మ్యాప్‌లతో దుష్ప్రచారం

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *