Rice Mill Raid | సీఎంఆర్​ ఇవ్వని రైస్​మిల్లులపై చర్యలు తీసుకుంటాం..

జిల్లాలో నిర్ణీత గడువులోగా ప్రభుత్వానికి  సీఎంఆర్ ఇవ్వని రైస్​మిల్లులపై చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ (స్థానికసంస్థలు)​ భుజంగరావు పేర్కొన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​ : Rice Mill Raid | జిల్లాలో నిర్ణీత గడువులోగా ప్రభుత్వానికి  సీఎంఆర్ ఇవ్వని రైస్​మిల్లులపై చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ (స్థానికసంస్థలు)​ భుజంగరావు పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం విజిలెన్స్​ అండ్​ ఎన్​ఫోర్స్​మెంట్​ అధికారులు రైస్​మిల్​పై దాడిచేయగా వివరాలు వెల్లడించారు.

Rice Mill Raid | సిద్ధి రామేశ్వర ఆగ్రో ఇండస్ట్రీస్​లో తనిఖీలు

Rice Mill Raid

ఈ క్రమంలో నగర శివారులోని సిద్ధి రామేశ్వర ఆగ్రో ఇండస్ట్రీస్​ ప్రైవేట్​ లిమిటెడ్​పై విజిలెన్స్​ అధికారులు గురువారం ఆకస్మిక దాడులు చేశారని అదనపు కలెక్టర్​ తెలిపారు. సదరు రైస్​మిల్​ (Rice Mill) నిర్వాహకులు 3,15,970.6 క్వింటాళ్ల సీఎంఆర్​ ఇవ్వాల్సి ఉండగా.. రైస్​మిల్లులో 1,12,282.40 క్వింటాళ్లు ధాన్యం మాత్రమే ఉందని.. మిగిలిన బియ్యంపై లెక్కలు లేవన్నారు. ఈ సందర్భంగా సదరు రైస్​మిల్​పై నివేదిక ఆధారంగా క్రిమినల్​ చర్యలు లేదా రికవరీ కోసం ఆదేశాలు జారీ చేస్తామని ఆయన పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి..: CPS Employees Rally | నిజామాబాద్​కు చేరిన ఉద్యోగుల ‘జన జాగరణ యాత్ర’..

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *