అక్షరటుడే వెబ్‌డెస్క్: KTR Legal Notice | గ్లోబరీనా సంస్థతో తనకు సంబంధం ఉందంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. వరంగల్ పర్యటనలో భాగంగా మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ నిర్వహించిన ఆయన.. సీఎం ఆరోపణలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
KTR Legal Notice | లీగల్ నోటీసులు ..
గ్లోబరీనా తన బినామీ సంస్థ అని నిరాధార ఆరోపణలు చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి ఇప్పటికే లీగల్ నోటీసులు పంపించినట్లు కేటీఆర్ వెల్లడించారు. తనపై చేసిన ఆరోపణలను రుజువు చేయాలని, లేదంటే బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై లై డిటెక్టర్ పరీక్షతో పాటు సీఐడీ విచారణకైనా తాను సిద్ధమని ప్రకటించారు.
KTR Legal Notice | కాంగ్రెస్ ప్రభుత్వ ఒప్పందాలపై ప్రశ్నలు ..
గ్లోబరీనా నిజంగానే తన బినామీ సంస్థ అయితే, మరి అదే సంస్థతో కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఒప్పందాలు కుదుర్చుకుందని కేటీఆర్ నిలదీశారు. మీ ప్రభుత్వమే ఆ సంస్థతో ఒప్పందాలు చేసుకుని, ఇప్పుడు అది తన సంస్థ అనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. సీఎం కుటుంబ అవినీతి అంశంపై సిట్, సీఐడీ విచారణకు రేవంత్ రెడ్డి సిద్ధమా అని సవాల్ విసిరారు
KTR Legal Notice | రాజ్‌భవన్ ధర్నాపై రాజకీయ నాటకం ..
కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాల్సిన సీఎం రేవంత్ రెడ్డి.. ఒక్కసారైనా ప్రధాని నరేంద్ర మోదీ పేరును ప్రస్తావించడానికి భయపడుతున్నారని విమర్శించారు. రాజ్‌భవన్ ముందు చేయాల్సిన ధర్నాను కొడంగల్‌లో చేయడం కేవలం రాజకీయ నాటకమేనని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి పగలు కాంగ్రెస్‌తో, రాత్రి బీజేపీతో ఉంటున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌కు ఒక మూట ఇస్తే, బీజేపీకి రెండు మూటలు పంపుతున్నారని ఎద్దేవా చేశారు. పాత కేసుల భయం, అమృత్ పథకం తదితర కాంట్రాక్టుల ప్రయోజనాల కోసమే ఆయన కేంద్రంతో రాజీ రాజకీయాలు చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు.
రేవంత్ రెడ్డి పగలు కాంగ్రెస్‌తో.. రాత్రి బీజేపీతో ఉంటాడు
కాంగ్రెస్ పార్టీకి ఒక మూట ఇస్తే.. బీజేపీకి రెండు మూటలు పంపుతున్నాడు
కుటుంబ అవినీతి అంశంలో సిట్, సీఐడీ విచారణకు రేవంత్ రెడ్డి సిద్ధమా?
ప్రధాని మోదీ పేరు ప్రస్తావించడానికి కూడా ముఖ్యమంత్రి భయపడుతున్నాడు
పాత కేసుల భయంతో… pic.twitter.com/o1OkdigPH4
— PulseNewsBreaking (@pulsenewsbreak) July 23, 2026
ఇది కూడా చదవండి: Pocharam Bhaskar Reddy | ఘనంగా డీసీసీబీ మాజీ ఛైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి జన్మదిన వేడుకలు