అక్షరటుడే, వెబ్డెస్క్ : Telangana Heavy Rains | తెలంగాణవ్యాప్తంగా శుక్రవారం మోస్తరు నుంచి భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉత్తర, పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు వర్షాలు కురుస్తాయి.
రాష్ట్రంలో ఇటీవల నిత్యం వర్షాలు కురుస్తున్నాయి. మొన్నటి వరకు వాయుగుండం ప్రభావంతో వానలు దంచికొట్టాయి. వాయుగుండం ప్రభావం తగ్గిన తర్వాత కూడా నిత్యం వానలు పడుతున్నాయి. దక్షిణ, మధ్య తెలంగాణ జిల్లాల్లో నేడు మోస్తరు వర్షాలు కురుస్తాయి. హైదరాబాద్ నగరంలో నేడు మధ్యాహ్నం వరకు వాతావరణం పొడిగా ఉంటుంది. సాయంత్రం, రాత్రి పూట వర్షం కురిసే ఛాన్స్ ఉంది.
Telangana Heavy Rains | అల్ప పీడనంతో..
ప్రస్తుతం జార్ఖండ్, పశ్చిమ బెంగాల్లో అల్ప పీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో రానున్న రోజుల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. ఇటీవల కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు ఉప్పొంగి పారుతున్నాయి. చెరువులకు జలకళ వచ్చింది. పలు చెరువులు మత్తడి దూకుతున్నాయి. జలాశయాల్లోకి సైతం వరద రావడంతో వానాకాలం పంటలకు ఢోకా లేదని రైతులు భావిస్తున్నారు. మరోవైపు భూగర్భ జలాలు సైతం పెరిగాయి.
ఇది కూడా చదవండి..: Varuna Yagam Telangana | వర్షాల కోసం వరుయాగం నిర్వహించనున్న సీఎం