Varuna Yagam Telangana | వర్షాల కోసం వరుయాగం నిర్వహించనున్న సీఎం

తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురవాలని ఈనెల 10న వరుణయాగం నిర్వహించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Varuna Yagam Telangana | ఎల్​నినో ప్రభావంతో ఈ ఏడాది రాష్ట్రంలో వర్షాలు ఆలస్యంగా ప్రారంభం అయ్యాయి. జులైలో భారీ వర్షాలు పడటంతో రైతాంగానికి మేలు చేసింది.

అయితే రానున్న రోజుల్లో సైతం ఎల్​నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా పడుతాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ (Telangana)లో విస్తారంగా వర్షాలు కురవాలని ఈనెల 10న వరుణయాగం నిర్వహించనుంది.

Varuna Yagam Telangana | నాగర్జున సాగర్​ తీరంతో..

సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు వరుణయాగం నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే యాదగిరిగుట్ట అర్చకులు, వేద పండితులు ముహూర్తం ఖరారు చేశారు. ఈ నెల 10న నాగార్జున సాగర్ డ్యామ్ తీరంలోని విజయవిహార్ ప్రాంగణంలో యాగం చేయనున్నారు. కృష్ణా, గోదావరి నదులు జలకళ సంతరించుకోవాలని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. పాడి పంటలు సమృద్ధిగా పండాలనే సంకల్పంతో వరుణయాగం నిర్వహిస్తున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. పూర్ణాహుతి కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారని పేర్కొన్నారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో యాదగిరిగుట్ట దేవస్థానం అర్చకులు, వేద పండితులు నిర్ణయించిన ముహూర్తం ప్రకారం యాగ క్రతువులు నిర్వహిస్తారు.

Varuna Yagam Telangana | నదులకు జలకళ

Varuna Yagam Telangana

రాష్ట్రంతో పాటు ఎగువన కురుస్తున్న వర్షాలతో తెలంగాణలో నదులు జలకళను సంతరించుకున్నాయి. కృష్ణా, గోదావరి నదులు ఉప్పొంగి పారుతున్నాయి. కృష్ణానదిపై జూరాల ప్రాజెక్ట్ నిండుకుండలా మారగా.. శ్రీశైలం సైతం మరో నాలుగు రోజుల్లో నిండనుంది. మరోవైపు ఎగువన గోదావరికి స్వల్ప ఇన్​ఫ్లో కొనసాగుతుండగా.. దిగువన మాత్రం భారీ వరద వస్తోంది.

ఇది కూడా చదవండి..: Kacheguda Bus Terminal | హైదరాబాద్‌లో ప్రజా రవాణాకు ఊతం.. చిలకలగూడలో కొత్త బస్ టెర్మినల్‌కు ప్రణాళిక

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *