అక్షరటుడే, వెబ్‌డెస్క్: Aug 07 Gold Prices | హైదరాబాద్ Hyderabad లో గురువారం పెరిగిన ధరలు శుక్రవారం అదే స్థాయిలో కొనసాగుతున్నాయి. 24 క్యారెట్ల (99.9 శాతం స్వచ్ఛత) బంగారం గ్రాము ధర రూ.14,974గా ఉండగా, 22 క్యారెట్ల (91.6 శాతం స్వచ్ఛత) బంగారం gold గ్రాము ధర రూ.13,726గా నమోదైంది. అలాగే 18 క్యారెట్ల (75 శాతం స్వచ్ఛత) బంగారం గ్రాము ధర రూ.11,231 వద్ద కొనసాగుతోంది.
Aug 07 Gold Prices | బలపడుతున్న ధరలు..
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు వరుసగా బలపడుతున్నాయి. శుక్రవారం Friday స్పాట్ గోల్డ్ Gold ధర ఔన్స్‌కు 0.4 శాతం పెరిగి 4,254.11 డాలర్లకు చేరుకుంది. గత సెషన్‌లో ఏడు వారాల గరిష్ఠ స్థాయిని తాకిన బంగారం ధరలు ఈ వారంలో ఇప్పటివరకు 5 శాతానికి పైగా లాభపడ్డాయి. అమెరికా గోల్డ్ ఫ్యూచర్స్ కూడా 0.3 శాతం పెరిగి ఔన్స్‌కు 4,312 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి.
Aug 07 Market Analysis | రెడ్‌లో గ్లోబల్ మార్కెట్లు..నెగెటివ్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ
Aug 07 Gold Prices | తగ్గుతున్న ఉద్రిక్తతలు
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టే సంకేతాలు కనిపించడం, ముడి చమురు crude oil ధరలు తగ్గుతుండటంతో ద్రవ్యోల్బణంపై ఉన్న ఆందోళనలు కొంత తగ్గాయి. దీంతో బంగారం ధరలకు మద్దతు లభిస్తున్నట్లు మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ Trump ఇరాన్ Iran తో యుద్ధం war త్వరలో ముగిసే అవకాశముందని చేసిన వ్యాఖ్యలు కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను ప్రభావితం చేశాయి.
Aug 07 Gold Prices | నాన్‌ఫార్మ్ పేరోల్స్ నివేదిక కోసం ఎదురుచూపులు
ఇక అమెరికా జులై July నెల నాన్‌ఫార్మ్ పేరోల్స్ (NFP) నివేదిక కోసం ప్రపంచ మార్కెట్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఈ నివేదిక ఆధారంగా అమెరికా America ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై తదుపరి నిర్ణయాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు.
వడ్డీ రేట్లపై అనిశ్చితి ఉన్నా..
ప్రస్తుతం సెప్టెంబరులో అమెరికా US వడ్డీ రేట్లు పెరిగే అవకాశాన్ని మార్కెట్ సుమారు 55 శాతంగా అంచనా వేస్తోంది. గత వారం ఈ అంచనా 63 శాతంగా ఉండటం గమనార్హం. వడ్డీ రేట్లపై అనిశ్చితి కొనసాగుతున్నప్పటికీ, 4,000 డాలర్ల స్థాయి బంగారానికి కీలక మద్దతుగా నిలుస్తోందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇతర విలువైన లోహాల్లో స్పాట్ సిల్వర్ ఔన్స్‌కు 0.8 శాతం పెరిగి 61.96 డాలర్లకు చేరుకోగా, ప్లాటినం 0.4 శాతం పెరిగి 1,735.71 డాలర్ల వద్ద ట్రేడైంది. మరోవైపు పల్లాడియం 0.3 శాతం తగ్గి ఔన్స్‌కు 1,367.06 డాలర్లకు చేరింది. అయితే ఈ మూడు లోహాలు కూడా వారాంతానికి లాభాలతో ముగిసే అవకాశాలు కనిపిస్తున్నాయి.