Stock Market Flat | ఫ్లాట్ గా స్టాక్ మార్కెట్

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market Flat | అమెరికా (America) ఓవైపు ఇరాన్‌తో శాంతి ఒప్పందం అంటూనే మరోవైపు తీవ్రమైన దాడులకు పాల్పడింది. ఆత్మరక్షణ కోసం ఇరాన్ క్షిపణి ప్రయోగ లాంచ్‌ప్యాడ్లు, సముద్రంలో మందుపాతరలు పరిచే బోట్లను ధ్వంసం చేసినట్లు ప్రకటించింది. దీంతో పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయి. క్రూడ్ ఆయిల్ ధర స్వల్పంగా పెరగడంతో మార్కెట్లు ఒత్తిడికి గురవుతున్నాయి.

Stock Market Flat | నష్టాలతో ప్రారంభమై..

దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market) మంగళవారం గ్యాప్ డౌన్ లో ప్రారంభమైంది. ఉదయం సెన్సెక్స్ 264 పాయింట్ల తో ప్రారంభమైనా క్రమంగా పుంజుకుని ఇంట్రాడేలో గరిష్టంగా 403 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 27 పాయింట్ల నష్టంతో ప్రారంభమె మరో 39 పాయింట్లు తగ్గింది. అక్కడినుంచి కోలుకుని 124 పాయింట్లు పెరిగింది. ఉదయం 11.40 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 20 పాయింట్ల లాభంతో 76,509 వద్ద, నిఫ్టీ 31 పాయింట్ల లాభంతో 24,063 వద్ద ఉన్నాయి.

Stock Market Flat | ఫార్మా, కన్జూమర్ డ్యూరెబుల్స్ మినహా..

ఫార్మా, కన్జూమర్ డ్యూరెబుల్స్ మినహా మిగిలిన అన్ని ఇండెక్స్‌లు లాభాలతో కొనసాగుతున్నాయి. మెటల్ ఇండెక్స్ 0.94 శాతం, టెలికాం 0.91 శాతం, యుటిలిటీ 0.82 శాతం, పవర్ 0.80 శాతం, ఎనర్జీ 0.67 శాతం లాభాలతో, ఫార్మా 0.25 శాతం, కన్జూమర్ డ్యూరెబుల్స్ 0.17 శాతం నష్టంతో ఉన్నాయి.

Top gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 17 స్టాక్స్ లాభాలతో, 13 స్టాక్స్ నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. ఎటర్నల్ 1.23 శాతం, మారుతి 0.71 శాతం, ఇన్ఫోసిస్ 0.65 శాతం, టెక్ మహీంద్రా 0.64 శాతం, హెచ్యూఎల్ 0.51 శాతం లాభాలతో ఉన్నాయి.

Top losers : ఇండిగో 0.84 శాతం, సన్‌ఫార్మా 0.77 శాతం, టీసీఎస్ 0.77 శాతం, యాక్సిస్ బ్యాంక్ 0.70 శాతం, కొటక్ బ్యాంక్ 0.66 శాతం నష్టాలతో ఉన్నాయి.

ఇది కూడా చదవండి..: Kia Car Offers | కియా కార్లపై భారీ ఆఫర్లు.. ఆ మోడళ్లపై రూ. 2.7 లక్షల వరకు ఆదా!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *