Ramchander Rao Criticism| బీజేపీలో చేరిన మైనారిటీ నేతలు.. సాదరంగా ఆహ్వానించిన రామచందర్ రావు

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్:Ramchander Rao Criticism|కూకట్‌పల్లిలోని బీజేపీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ రాష్ట్ర నేత ఎన్. రామచందర్ రావు(Ramchander Rao) మాట్లాడారు.రాష్ట్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం తుగ్లక్ పాలన సాగిస్తే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అంతకంటే ఘోరంగా ‘మహా తుగ్లక్’ తరహాలో పాలిస్తోందని తీవ్రంగా విమర్శించారు. ఈ సమావేశంలో మేడ్చల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు మల్లారెడ్డి, కూకట్‌పల్లి నియోజకవర్గ ఇన్‌చార్జ్ మాధవరం కాంతారావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామచందర్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై నిప్పులు చెరిగారు.

Ramchander Rao Criticism|ఇండ్ల పేరుతో ప్రజలకు మోసం..

గతంలో కేసీఆర్ ప్రభుత్వం డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పేరుతో ప్రజలను వంచించిందని.. ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ ‘ఇందిరమ్మ ఇళ్ల’ పేరుతో అదే తరహాలో మోసానికి తెరతీసిందని ఆరోపించారు. హైదరాబాద్ నగరంలో కనీస తాగునీటి సౌకర్యం కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని, ఎండకాలంలో ప్రజలు ట్యాంకర్లపై ఆధారపడాల్సి వచ్చిందని మండిపడ్డారు.

Ramchander Rao Criticism|జీహెచ్‌ఎంసీ విభజనపై విమర్శలు..

ఎమ్ఐఎమ్ పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గి కాంగ్రెస్ ప్రభుత్వం జీహెచ్‌ఎంసీని మూడు ముక్కలు చేస్తోందని రామచందర్ రావు ఆరోపించారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ మజ్లిస్‌తో దోస్తీ కడితే, ఇప్పుడు కాంగ్రెస్ అదే బాటలో నడుస్తూ ఒక కార్పొరేషన్‌ను వారికి అప్పగించేందుకు కుట్ర చేస్తోందని విమర్శించారు. “దేశంలో బీజేపీ అధికారంలో ఉన్న మెట్రో నగరాలు ఏ స్థాయిలో అభివృద్ధి చెందాయో గమనించాలి. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు బీజేపీని గెలిపిస్తే హైదరాబాద్‌ను ‘విశ్వ నగరం’గా తీర్చిదిద్దుతాం. నిరంతర విద్యుత్‌తో పాటు అండర్‌గ్రౌండ్ విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని తెలిపారు.”

Ramchander Rao Criticism|బీజేపీలో చేరిన మైనారిటీలు..

ఈ సమావేశం సందర్భంగా మైనారిటీ విభాగం రాష్ట్ర నాయకుడు షాజహాన్ ఆధ్వర్యంలో పలువురు మైనారిటీ నేతలు రామచందర్ రావు సమక్షంలో బీజేపీలో చేరారు. పార్టీ తీర్థం పుచ్చుకున్న వారికి కాషాయ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ సింగ్, ముఖ్య నాయకులు శ్రీకర్ రావు, ప్రీతం రెడ్డి, పద్మయ్య, మాజీ కార్పొరేటర్ మహేందర్, జీవన్, శ్రీలత రెడ్డి, నర్వ పవన్, అంజి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: LIC New Jeevan Saathi | ఒకే ప్లాన్‌తో భార్యాభర్తలిద్దరికీ బీమా.. న్యూ జీవన్ సాతి పేరుతో లాంచ్ చేసిన ఎల్ఐసీ

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *