జాబ్స్​ & ఎడ్యుకేషన్​TG EAPCET Results | తెలంగాణ ఎప్‌సెట్‌ ఫలితాలు విడుదల

TG EAPCET Results | తెలంగాణ ఎప్‌సెట్‌ ఫలితాలు విడుదల

తెలంగాణలో ఎప్​సెట్​ ఫలితాలు విడుదల అయ్యాయి. ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు ఫలితాలను విడుదల చేశారు.

అక్షరటుడే, వెబ్​డెస్క్ : TG EAPCET Results | తెలంగాణలో ఎప్​సెట్​ ఫలితాలు విడుదల అయ్యాయి. ఇంజినీరింగ్ (Engineering)​, ఫార్మసీ (Pharmacy), అగ్రికల్చర్​ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎప్​సెట్​ పరీక్షను నిర్వహించిన విషయం తెలిసిందే.

హైదరాబాద్​లోని జేఎన్​టీయూ (JNTUH) ఆదివారం ఉదయం ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు ఫలితాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ బాలకిష్టారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇంజినీరింగ్‌ విభాగంలో 1,97,241 మంది, అగ్రికల్చర్‌, ఫార్మసీ విభాగంలో 84,954 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు అయ్యారు. విద్యార్థులు http://eapcet.tgche.ac.inలో ఫలితాలు చూసుకొవొచ్చు. కాగా, ఈ ఏడాది ఎప్‌సెట్‌ చివరి పరీక్ష ముగిసిన వారం రోజుల్లోపే ఫలితాలను ప్రకటించడం గమనార్హం.

TG EAPCET Results | 73.36 శాతం ఉత్తీర్ణత

ఇంజనీరింగ్‌లో 73.36 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇంజనీరింగ్‌లో 156.63 మార్కులతో ఎం. రుషి (ఉప్పల్​) టాపర్​గా నిలిచాడు. 148.70 మార్కులతో అన్షుల్, 147.05 మార్కులతో టాప్‌-3గా కడపకు చెందిన వంశీధర్‌రెడ్డి తర్వాత స్థానాల్లో నిలిచారు.

దీనిని కూడా చదవండి : Telangana ANM Results | ఏఎన్​ఎం పరీక్ష ఫలితాలు విడుదల

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ACB Raids HMWSSB GM | జలమండలి జీఎంకు ఏసీబీ షాక్‌.. కుప్పలుగా నోట్ల కట్టలు, బంగారం స్వాధీనం!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: ACB Raids HMWSSB GM | భాగ్యనగరంలో అవినీతి...

Nizamabad Exhibition | ఎగ్జిబిషన్​ ఒకరోజు మూసివేత.. విరిగిన పరికరాలకు మరమ్మతులు

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Nizamabad Exhibition | నగరంలోని పాలిటెక్నిక్​ మైదానంలో...

Hyderabad Water Supply | హైదరాబాద్ వాసులకు అలెర్ట్​.. నీటి సరఫరాలో అంతరాయం

అక్షరటుడే, వెబ్​డెస్క్: Hyderabad Water Supply | హైదరాబాద్ (Hyderabad) నగరంలోని పలు...