అక్షరటుడే, వెబ్‌డెస్క్: Revanth Reddy Anti Drug Pledge | రాజ్‌భవన్‌లో సోమవారం Shiv Pratap Shuklaను A. Revanth Reddy మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జూన్ 12న పాఠశాలల పునఃప్రారంభం సందర్భంగా నిర్వహించనున్న విద్యార్థుల మహాసభకు హాజరుకావాలని గవర్నర్‌ను ఆహ్వానించారు.
Revanth Reddy Anti Drug Pledge | అవగాహన కార్యక్రమం
వచ్పే నెల 12వ తేదీన విద్యార్థుల సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమం చేపడుతోంది. విద్యార్థులు మద్యం, పొగాకు, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలని సంకల్పం చేయించేలా సామూహిక ప్రతిజ్ఞ నిర్వహించనున్నారు.
ఇటీవల గవర్నర్ శివప్రతాప్ శుక్లా, విద్యార్థులతో యాంటీ డ్రగ్ ప్రతిజ్ఞ చేయించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి సూచించారు. ఆయన సూచన మేరకు రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో విద్యార్థుల సమీకరణతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సన్నద్ధం అవుతోంది.

