అక్షరటుడే, వెబ్‌డెస్క్ : IPL Final Driving | దేశంలో ఐపీఎల్‌కు ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. నిత్యం కోట్లాది మంది ఐపీఎల్ మ్యాచ్‌లను చూశారు. ఇక ఫైనల్ మ్యాచ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అయితే మ్యాచ్ చూస్తూ కారు డ్రైవ్ చేయడంతో యువకులు ప్రమాదం బారిన పడ్డారు.
డ్రైవింగ్ చేసే సమయంలో అప్రమత్తంగా ఉండాలి. అయినా కూడా చాలా మంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు. ఫోన్ మాట్లాడుతూ.. కార్లలో సినిమాలు చూస్తూ డ్రైవింగ్ చేస్తుంటారు. తాజాగా జగిత్యాల (Jagtial) రూరల్ మండలం మోరపెల్లి వద్ద ఓ కారు అదుపు తప్పి బావిలోకి దూసుకెళ్లింది.
IPL Final Driving | ఒకరి మృతి
నివేష్, అశ్విన్, అరుణ్ అనే ముగ్గురు యువకులు థార్ వాహనంలో మొబైల్లో ఐపీఎల్ ఫైనల్ (IPL Final) మ్యాచ్ చూస్తూ ప్రయాణించారు. ఈ క్రమంలో వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న బావిలోకి దూసుకెళ్లింది. డ్రైవింగ్ చేస్తున్న జగిత్యాలకు చెందిన అరుణ్ బావిలో మునిగి మృతి చెందగా.. నివేష్, అశ్విన్ సురక్షితంగా బయటపడ్డారు. పోలీసులు రెండు గంటలు శ్రమించి అరుణ్ మృతదేహాన్ని, కారును బయటకు తీశారు. ఈ ఘటనతో యువకుడి కుటుంబంలో విషాదం నెలకొంది.
IPL ఫైనల్ మ్యాచ్ చూస్తూ డ్రైవింగ్.. బావిలోకి దూసుకెళ్లిన కారు
TG: జగిత్యాల రూరల్ మండలం మోరపెల్లి వద్ద ఘోర ప్రమాదం జరిగింది. నివేష్, అశ్విన్, అరుణ్ అనే ముగ్గురు యువకులు థార్ వాహనంలో మొబైల్లో ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ చూస్తూ ప్రయాణించారు. ఈ క్రమంలో వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కనే… pic.twitter.com/D295XrjQrx
— ChotaNews App (@ChotaNewsApp) June 1, 2026
ఇది కూడా చదవండి..: Velpur VDC | సాంఘిక బహిష్కరణ చేశారని గంగపుత్రుల ఆవేదన.. వీడీసీపై కలెక్టర్‌కు ఫిర్యాదు


