బిజినెస్​Kia Car Offers | కియా కార్లపై భారీ ఆఫర్లు.. ఆ మోడళ్లపై రూ. 2.7...

Kia Car Offers | కియా కార్లపై భారీ ఆఫర్లు.. ఆ మోడళ్లపై రూ. 2.7 లక్షల వరకు ఆదా!

కియా ఇండియా మే నెల ఆఫర్లను ప్రకటించింది. ఎంపిక చేసిన మోడళ్లపై గరిష్టంగా రూ. 2.70 లక్షల వరకు భారీ ప్రయోజనాలను అందిస్తోంది.

అక్షరటుడే, వెబ్​డెస్క్: Kia Car Offers | ప్రముఖ ఆటోమొబైల్ రంగ కంపెనీ ‘కియా ఇండియా’ (Kia India) మే నెలలో ఆఫర్లను ప్రకటించింది. పోటీని తట్టుకునేందుకు, స్టాక్‌ను క్లియర్ చేసేందుకు ఎంపిక చేసిన పలు మోడళ్లపై గరిష్టంగా రూ. 2.70 లక్షల వరకు భారీ ప్రయోజనాలను అందించనున్నట్లు ప్రకటించింది.

ఇందులో ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, స్క్రాపేజ్ సపోర్ట్, లాయల్టీ రివార్డులు, కార్పొరేట్ డిస్కౌంట్లు ఉన్నాయి. ఎస్‌యూవీ లేదా ఎంపీవీ కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లకు ఇది అద్భుతమైన అవకాశంగా నిలవనుంది. ఈ ఆఫర్లు డీలర్ వద్ద ఉన్న స్టాక్ లభ్యత, ప్రాంతం, కొనుగోలుదారు అర్హత ఆధారంగా మారుతుంటాయి. మోడళ్లవారీగా ఆఫర్ల వివరాలిలా ఉన్నాయి..

Kia Car Offers | కియా కార్నివాల్

కియా లైనప్‌లో అత్యంత ఖరీదైన లగ్జరీ ఎంపీవీ ‘కియా కార్నివాల’ (Kia Carnival)పై ఈ నెలలో భారీ ఆఫర్లు లభిస్తున్నాయి. ఈ లైనప్‌లో అత్యధిక డిస్కౌంట్ పొందుతున్న మోడల్ లగ్జరీ ఎంపీవీ ఇదే. దీనిపై రూ. 2 లక్షల వరకు ఎక్స్ఛేంజ్ సపోర్ట్ లభిస్తోంది. అదనంగా స్క్రాపేజ్, కార్పొరేట్ బెనిఫిట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అన్నీ కలిపి గరిష్టంగా రూ. 2.70 లక్షల వరకు ఆఫర్ వర్తించనుంది.

Kia Car Offers | కియా కారెన్స్ క్లావిస్ , ఈవీ..

కియా తమ కారెన్స్ క్లావిస్ పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ వేరియంట్లపై భారీ ఆఫర్లను ఇస్తోంది. కారెన్స్ క్లావిస్ ఈవీ పై రూ. 2.15 లక్షల వరకు ప్రయోజనాలు అందనున్నాయి. ఎక్స్ఛేంజ్, స్క్రాపేజ్, కార్పొరేట్ స్కీమ్‌ల రూపంలో కస్టమర్లు ఈ ఆఫర్లను పొందవచ్చు.
కారెన్స్ క్లావిస్ టర్బో పెట్రోల్ వేరియంట్లపై రూ. 1.55 లక్షల వరకు ఆఫర్లు ప్రకటించింది. టర్బో వేరియంట్లకు అదనంగా ఐదేళ్ల కాంప్లిమెంటరీ ఎక్స్‌టెండెడ్ వారంటీ ప్యాకేజీని కూడా కంపెనీ అందిస్తోంది. డీజిల్, నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ వెర్షన్లపై రూ. 85 వేల వరకు ప్రయోజనాలు పొందవచ్చు.

Kia Car Offers | కియా సెల్టోస్

మిడ్ సైజ్ ఎస్‌యూవీ ’సెల్టోస’పై మంచి ఆఫర్లున్నాయి. గతేడాదికి చెందిన ఇన్వెంటరీపై రూ. 95 వేల వరకు ఆఫర్లు ఉన్నాయి. సరికొత్త 2026 మోడళ్లపై డిస్కౌంట్ సుమారు రూ. 40 వేల వరకు ఆఫర్లున్నాయి.

కియా సిరోస్ : సిరోస్ 2025 మోడల్ ఇన్వెంటరీపై రూ. 85 వేల వరకు, 2026 మోడల్ పై రూ. 50 వేల వరకు తగ్గింపు ధరను పొందవచ్చు.

స్టాండర్డ్ కియా కారెన్స్ : రెగ్యులర్ కియా కారెన్స్ ఎంపీవీ మోడల్‌పై రూ. 40 వేల వరకు ఎక్స్ఛేంజ్, లాయల్టీ బోనస్ స్కీమ్‌లు అందుబాటులో ఉన్నాయి.

కియా సోనెట్ : కాంపాక్ట్ ఎస్‌యూవీ సోనెట్ 2026 మోడల్ పై రూ. 35 వేల వరకు, 2025 మోడల్‌పై రూ. 30 వేల వరకు ప్రయోజనాలు అందనున్నాయి.

ఇది కూడా చదవండి..: May 26 Market Analysis | మిశ్రమంగా ఆసియా మార్కెట్లు.. నెగెటివ్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

MGBS Bus Fire| ఎంజీబీఎస్‌లో అగ్నిప్రమాదం.. ఆర్టీసీ బస్సు కింద మంటలు

అక్షరటుడే వెబ్‌డెస్క్:MGBS Bus Fire|హైదరాబాద్‌లోని మహాత్మా గాంధీ బస్ స్టేషన్ (MGBS)లో...

Grain procurement issues | అన్నదాత ఆక్రోషం.. రోడ్డుపై ధాన్యం బస్తాలు తగలబెట్టి నిరసన

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Grain procurement issues | మండలంలోని(Yellareddy) హాజీపూర్ తండాలో...

Thailand Drug Dealer Arrest | లేడీ డ్యాన్సర్ల వేషంలో.. డ్రగ్స్​ డాన్​ను పట్టుకున్న పోలీసులు

అక్షరటుడే, వెబ్​డెస్క్: Thailand Drug Dealer Arrest | థాయ్‌లాండ్‌ (Thailand)లో...

Ananya Panday Dance Trolls | అనన్య పాండే డ్యాన్స్​పై ట్రోల్స్..

అక్షరటుడే, వెబ్​డెస్క్: Ananya Panday Dance Trolls | సినీ నటి...