అక్షరటుడే, వెబ్‌డెస్క్: Indian Stock Market | పశ్చిమాసియాలో దీర్ఘకాలంగా కొనసాగుతున్న జియో పొలిటికల్ టెన్షన్స్ పెట్టుబడిదారుల సెంటిమెంట్ ను దెబ్బతీస్తున్నాయి. ఇరాన్‌పై నిరవధిక నావికా దిగ్బంధనం విధిస్తామని అమెరికా హెచ్చరించడంతో ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి. దీంతో ద్రవ్యోల్బణ భయాలతో సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల బాటలో సాగుతున్నాయి.
Indian Stock Market | నష్టాలతో ప్రారంభం..
దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market) శుక్రవారం నష్టాలతో ప్రారంభమైంది. ఉదయం సెన్సెక్స్ 145 పాయింట్ల నష్టంతో ప్రారంభమై 20 పాయింట్లు పెరిగింది. అక్కడినుంచి 239 పాయింట్లు పడిపోయింది. నిఫ్టీ 34 పాయింట్ల నష్టంతో ప్రారంభమై మరో 65 పాయింట్లు తగ్గింది. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 292 పాయింట్ల నష్టంతో 77,787 వద్ద, నిఫ్టీ 69 పాయింట్ల నష్టంతో 24,326 వద్ద ఉన్నాయి.
Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 4 స్టాక్స్ లాభాలతో, 26 స్టాక్స్ నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. ఎయిర్‌టెల్ 2.94 శాతం, అదానీ పోర్ట్స్ 1.34 శాతం, టైటాన్ 0.36 శాతం, ఎటర్నల్ 0.05 శాతం లాభాలతో ఉన్నాయి.
Top Losers : ఆసియన్ పెయింట్ 2.24 శాతం, టెక్ మహీంద్రా 2.12 శాతం, ఎన్టీపీసీ 1.96 శాతం, టీసీఎస్ 1.38 శాతం, హెచ్సీఎల్ టెక్ 1.36 శాతం నష్టాలతో ఉన్నాయి.
ఇది కూడా చదవండి..: Aug 14 Gold Prices | అంతర్జాతీయ మార్కెట్‌లో ఒత్తిడి.. నేటి బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..