అక్షరటుడే, వెబ్‌డెస్క్: Stock Market Gains | అంతర్జాతీయ మార్కెట్లనుంచి అందిన సానుకూల సంకేతాలతో దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic stock market) మంగళవారం లాభాలతో ప్రారంభమైనప్పటికీ తొలి గంటలో తీవ్ర ఒడిదుడుకులకు లోనైంది.
భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడం, ముడి చమురు ధరలు అదుపులో ఉండడంతో భారతీయ ప్రధాన సూచీలలో రెండు రోజుల పతనానికి అడ్డుకట్ట పడింది. బ్యాంకింగ్ షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో దేశీయ స్టాక్ మార్కెట్ మంగళవారం లాభాలతో ముగిసింది.
Stock Market Gains | గ్యాప్ అప్ లో ప్రారంభమై..
దేశీయ స్టాక్ మార్కెట్ మంగళవారం భారీ లాభాలతో ప్రారంభమైంది. ఉదయం సెన్సెక్స్ 511 పాయింట్ల లాభంతో ప్రారంభమైనా నిలదొక్కుకోలేకపోయింది. ఇంట్రాడే గరిష్టాలనుంచి 525 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ 136 పాయింట్ల లాభంతో ప్రారంభమైనా అమ్మకాల ఒత్తిడికి గురై 130 10 పాయింట్లు తగ్గింది. చివరికి సెన్సెక్స్ 394 పాయింట్ల నష్టంతో 73,918 వద్ద, నిఫ్టీ 119 పాయింట్ల నష్టంతో 23,242 వద్ద స్థిరపడ్డాయి.
Stock Market Gains | ఐటీ, యుటిలిటీ మినహా..
ఐటీ, యుటిలిటీ రంగాలు మినహా అన్ని ఇండెక్స్‌లు లాభాలతో ముగిశాయి. బ్యాంక్ నిఫ్టీ 2.09 శాతం, రియాలిటీ 1.63 శాతం, ఫైనాన్షియల్ సర్వీసెస్ 1.60 శాతం, ఆటో ఇండెక్స్ 1.34 శాతం, క్యాపిటల్ గూడ్స్ 1.02 శాతం లాభపడగా.. యుటిలిటీ ఇండెక్స్ 0.63 శాతం, ఐటీ 0.48 శాతం నష్టపోయాయి.
Stock Market Gains | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..
బీఎస్ఈలో నమోదైన కంపెనీలలో 2,782 కంపెనీలు లాభపడగా 1,423 స్టాక్స్ నష్టపోయాయి. 193 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 107 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 81 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి.
Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 18 స్టాక్ లాభపడగా.. 12 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. ఇండిగో 4.04 శాతం, ఎస్బీఐ 2.13 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 2.03 శాతం, యాక్సిస్ బ్యాంక్ 1.92 శాతం, బజాజ్ ఫైనాన్స్ 1.84 శాతం లాభపడ్డాయి.
Top Losers : టైటాన్ 2.08 శాతం, ఎన్టీపీసీ 1.96 శాతం, పవర్‌గ్రిడ్ 1.64 శాతం, టెక్ మహీంద్రా 1.02 శాతం, ఎటర్నల్ 1.01 శాతం నష్టపోయాయి.
ఇది కూడా చదవండి..: Pride@Godrej 2026 | ‘ప్రైడ్ గోద్రెజ్ 2026’ వేడుకలు.. క్వీర్ వర్గాల కోసం సరికొత్త ‘ఫెలోషిప్’ ప్రారంభం
