Stock Market Losses | ఐదో రోజూ నష్టాలే!

దేశీయ స్టాక్ మార్కెట్ వరుసగా ఐదో సెషన్‌లోనూ నష్టాలతో ముగిసింది. సెన్సెక్స్ 281 పాయింట్లు, నిఫ్టీ 78 పాయింట్లు కోల్పోయాయి.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Stock Market Losses | పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంఘర్షణలతో ముడిచమురు ధరలు అధిక స్థాయిలలోనే ట్రేడ్ అవుతున్నాయి. అమెరికా, ఇరాన్‌ల మధ్య యుద్ధం ఫలితంగా ఇంధన ధరలు అధికంగానే కొనసాగుతాయని, దీనికి అమెరికన్లు సిద్ధంగా ఉండాలని ట్రంప్ పేర్కొనడం భారత మార్కెట్లపై ప్రభావం చూపింది. దీంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తూ లాభాల స్వీకరణకే ప్రాధాన్యత ఇస్తుండడంతో స్టాక్ మార్కెట్ కోలుకోవడం లేదు. వరుసగా ఐదో సెషన్‌లోనూ నష్టాలతో ముగిసింది.

Stock Market Losses | నష్టాలతో ప్రారంభమై..

దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic stock market) సోమవారం నష్టాలతో ప్రారంభమైంది. ఉదయం సెన్సెక్స్ 117 పాయింట్ల నష్టంతో ప్రారంభమై 36 పాయింట్లు పెరిగింది. ప్రాఫిట్ బుకింగ్‌తో ఇంట్రాడే గరిష్టాలనుంచి 460 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ 23 పాయింట్ల నష్టంతో ప్రారంభమై 14 పాయింట్లు పెరిగింది. అక్కడినుంచి 129 పాయింట్లు తగ్గింది. చివరికి సెన్సెక్స్ 281 పాయింట్ల నష్టంతో 77,728 వద్ద, నిఫ్టీ 78 పాయింట్ల నష్టంతో 24,287 వద్ద స్థిరపడ్డాయి.

Stock Market Losses | పడేసిన టెక్ స్టాక్..

టెక్నాలజీ స్టాక్స్ ప్రధాన సూచీలను పడేశాయి. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 1.75 శాతం నష్టపోయింది. ఎఫ్ ఎంసీజీ 1.05 శాతం, హెల్త్ కేర్ ఇండెక్స్ 0.46 శాతం పడిపోయాయి. మెటల్ ఇండెక్స్ 1.26 శాతం లాభపడింది.

Stock Market Losses | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..

బీఎస్ఈలో నమోదైన కంపెనీలలో 2,087 కంపెనీలు లాభపడగా 2,353 స్టాక్స్ నష్టపోయాయి. 234 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 175 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 120 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి.
Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 7 స్టాక్ లాభపడగా.. 23 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. టాటా స్టీల్ 1.47 శాతం, యాక్సిస్ బ్యాంక్ 1.03 శాతం, రిలయన్స్ 0.80 శాతం, బీఈఎల్ 0.49 శాతం, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 0.36 శాతం లాభపడ్డాయి.

Top Losers : ఇన్ఫోసిస్ 2.66 శాతం, హెచ్సీఎల్ టెక్ 2.53 శాతం, సన్‌ఫార్మా 2.20 శాతం, టీసీఎస్ 1.87 శాతం, టెక్ మహీంద్రా 1.77 శాతం నష్టపోయాయి.

ఇది కూడా చదవండి..: Moto G Max 5G | మోటోరోలా నుంచి మిడ్ రేంజ్ ఫోన్.. ఆగస్టు 20 నుంచి అందుబాటులోకి..

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *