అక్షరటుడే, వెబ్‌డెస్క్: Moto G Max 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ అయిన మోటోరోలా భారత మార్కెట్‌లో మరో మోడల్ ఫోన్ ను విడుదల చేసింది. మోటో జీ మ్యాక్స్ 5జీ పేరుతో దీనిని తీసుకువచ్చింది.
Moto G Max 5G | మోటో జీ సిరీస్ నుంచి మరొక స్మార్ట్ ఫోన్
మోటో జీ సిరీస్ నుంచి వచ్చిన మరొక స్మార్ట్ ఫోన్ ఇది. 7000 ఎంఏహెచ్ బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ 6ఎస్ జెన్ 4 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టంతో తీసుకువచ్చిన ఈ ఫోన్ ధర రూ. 27,999. పాంటోన్ స్టార్ గేజర్, అలాస్కాన్ బ్లూ, మాలాగా కలర్స్‌లో సింగిల్ వేరియంట్‌లో లభిస్తుంది. ఎంపిక చేసిన క్రెడిట్ కార్డులపై రూ. 1000 డిస్కౌంట్ పొందే అవకాశం ఉంది. ఫ్లిప్‌కార్ట్ (Flipkart)తో పాటు మోటోరోలా అధికారిక వెబ్‌సైట్‌లో ఆగష్టు 20 మధ్యాహ్నం 12 గంటల నుంచి సేల్ అందుబాటులోకి రానుంది. ఫోన్ స్పెసిఫికేషన్స్ ఇలా ఉన్నాయి.
- 6.72 ఇంచ్ ఫుల్ ఎఫ్‌హెచ్‌డీ ప్లస్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్‌ప్లే.
- 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్.
- 1080 x 2400 పిక్సల్స్ రిజల్యూషన్.
- కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7ఐ ప్రొటెక్షన్.
- ఐపీ64 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ సర్టిఫికెట్.
- స్నాప్ డ్రాగన్ 6ఎస్ జెన్ 4 ప్రాసెసర్.
- ఆండ్రాయిడ్ 16 ఆధారిత మోటో హలో యూఎక్స్ ఆపరేటింగ్ సిస్టం.
- వెనుకవైపు 50 మెగా పిక్సెల్ సోనీ ఎల్ వైటీఐఏ 600 మెయిన్ కెమెరాతో పాటు 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, 2 మెగా పిక్సెల్ టెలీఫొటో లెన్స్‌తో కూడిన ట్రిపుల్ కెమెరా సెట్ అప్.
- ముందువైపు సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా.
- 7000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం
- 33 వాట్ టర్బో పవర్ చార్జింగ్ సపోర్ట్.
- 6 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 27,999.
ఇది కూడా చదవండి..: IPO Listing Gains | అదరగొట్టిన ఐపీవోలు.. భారీ లాభాలను అందించిన ధూత్ ట్రాన్స్‌మిషన్ ..