Infinix Smart 20 | ఇన్ఫినిక్స్ నుంచి బడ్జెట్ స్మార్ట్ ఫోన్..

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Infinix Smart 20 | చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ ఇన్ఫినిక్స్.. భారత్‌లో మరో స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేయడానికి సిద్ధమయ్యింది. ఈనెల 8న కొత్త బడ్జెట్ 5జీ స్మార్ట్ ఫోన్ ఇన్ఫినిక్స్ స్మార్ట్ 20 ని విడుదల చేయనుంది.

దీని ధర రూ. 13 వేలలోపు ఉంటుందని భావిస్తున్నారు. ఫ్లిప్‌కార్ట్‌ (Flipkart)లో అందుబాటులో ఉండనున్న ఫోన్‌కు సంబంధించి ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫాంలలో లీకయిన సమాచారం మేరకు దీని స్పెసిఫికేషన్స్ ఇలా ఉండే అవకాశాలున్నాయి.

Infinix Smart 20

డిస్‌ప్లే : 6.78 ఇంచ్ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే అమర్చారు. 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్, 720 x 1600 పిక్సల్స్ రిజల్యూషన్, ఐపీ64 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ సర్టిఫికెట్ కలిగి ఉంది.

ప్రాసెసర్ : మీడియాటెక్ హెలియో జీ81 అల్టిమేట్ ప్రాసెసర్ అమర్చారు. ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఎక్స్‌వోఎస్ 16 ఆపరేటింగ్ సిస్టంతో పనిచేస్తుంది.

Infinix Smart 20 | కెమెరా సెటప్..

వెనకవైపు 8 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరాతో పాటు 2 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్ తో కూడిన డ్యుయల్ కెమెరా సెట్ అప్ ఉంది. ముందువైపు సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇచ్చారు.

బ్యాటరీ సామర్థ్యం : 5200 ఎంఏహెచ్ బ్యాటరీ అమర్చారు. ఇది 15 వాట్ చార్జింగ్ సపోర్ట్, 5 వాట్ వైర్డ్ రివర్స్ చార్జింగ్ సపోర్ట్ చేస్తుంది.

వేరియంట్స్ : క్లౌడ్ లైన్ బ్లూ, సన్ లైక్ ఆరంజ్, పొలారిస్ టైటానియం, షాడో బ్లాక్ కలర్లలో, 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 4 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంటుంది. హై ఎండ్ వేరియంట్ ధర రూ. 13 వేలలోపు ఉంటుందని అంచనా.

ఇది కూడా చదవండి..: RBI Repo Rate | ఆర్‌బీఐ కీలక నిర్ణయం.. వడ్డీ రేట్లు యథాతథం

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *