అక్షరటుడే, వెబ్‌డెస్క్: Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్ ఒడిదుడుకుల మధ్య నష్టాలతో సాగుతోంది. ఉదయం 11.45 గంటల ప్రాంతంలో సెన్సెక్స్(sensex) 803 పాయింట్లు, నిఫ్టీ 218 పాయింట్ల నష్టంతో ఉన్నాయి.
Stock Market | లెబనాన్‌పై ఇజ్రాయిల్ దాడులు..
లెబనాన్‌పై(Israel ) ఇజ్రాయెల్(Lebanon) సైన్యం దాడులు చేయడంతో మరోసారి ఉద్రిక్తతలు నెలకొన్నాయి. పశ్చిమాసియాలో యుద్ధానికి శాశ్వత ముగింపు పలికే ప్రయత్నాలపై స్విట్జర్లాండ్‌లో ఇరాన్(Iron), యునైటెడ్ స్టేట్స్ మధ్య జరగాల్సిన చర్చలు వాయిదా పడిన తరుణంలో ఈ దాడులు జరగడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దీనికితోడు అమెరికాకు చెందిన ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ యాక్సెంచర్ తన ఆదాయ వృద్ధి అంచనాలను తగ్గించిన తర్వాత దేశీయ ఐటీ షేర్లలోనూ తీవ్రమైన అమ్మకాల ఒత్తిడి నెలకొంది. దీంతో సెన్సెక్స్, నిఫ్టీలలో 5 సెషన్ల లాభాల పరంపరకు బ్రేక్ పడింది.
Stock Market | భారీ గ్యాప్ డౌన్‌లో ప్రారంభం..
దేశీయ స్టాక్ మార్కెట్ శుక్రవారం ఉదయం భారీ నష్టాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్ 558 పాయింట్ల నష్టంతో ప్రారంభమై 6 పాయింట్లు పెరిగింది. అక్కడినుంచి 301 పాయింట్లు పడిపోయింది. నిఫ్టీ 177 పాయింట్ల నష్టంతో ప్రారంభమై 20 పాయింట్లు పైకి ఎగబాకింది. ఇంట్రాడే గరిష్టాలనుంచి 75 పాయింట్లు కోల్పోయింది. ఉదయం 11.45 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 803 పాయింట్ల నష్టంతో 76,606 వద్ద, నిఫ్టీ 218 పాయింట్ల నష్టంతో 23,949 వద్ద ఉన్నాయి.
Stock Market | Top gainers..
బీఎస్ఈ(BSE) సెన్సెక్స్‌లో 9 స్టాక్స్ లాభాలతో, 21 స్టాక్స్ నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. ఎన్టీపీసీ 1.28 శాతం, ఎయిర్‌టెల్ 0.93 శాతం, బజాజ్ ఫైనాన్స్ 0.59 శాతం, టైటాన్ 0.49 శాతం, సన్‌ఫార్మా 0.47 శాతం లాభాలతో ఉన్నాయి. టాప్ లూసర్స్‌గా ఇన్ఫోసిస్ 7.87 శాతం, టీసీఎస్ 5.82 శాతం, టెక్ మహీంద్రా 4.72 శాతం, హెచ్సీఎల్ టెక్ 3.80 శాతం, హెచ్డీఎఫ్ సీ బ్యాంక్ 2.45 శాతం నష్టాలతో ఉన్నాయి.