Indian Stock Market Today | నష్టాలకు తెర.. భారీ లాభాల్లో సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్ లో ఐదు రోజుల నష్టాలకు తెరపడింది. ఉదయం 11 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 594 పాయింట్లు, నిఫ్టీ 160 పాయింట్ల లాభంతో ఉన్నాయి.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Indian Stock Market Today | పశ్చిమాసియాలో జియో పొలిటికల్ టెన్షన్స్ తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో క్రూడ్ ఆయిల్ ధర తగ్గుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో గ్లోబల్ మార్కెట్ల (Global markets) నుంచి అందుతున్న సంకేతాలతో దేశీయ స్టాక్ మార్కెట్ సైతం పాజిటివ్ గా స్పందిస్తోంది. సెన్సెక్స్ , నిఫ్టీ ఐదు సెషన్ ల తర్వాత లాభాల బాట పట్టడంతో ఇన్వెస్టర్లు ఊపిరి పీల్చుకున్నారు.

Indian Stock Market Today | గ్యాప్ అప్ లో ప్రారంభం..

దేశీయ స్టాక్ మార్కెట్ సోమవారం ఉదయం భారీ లాభాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్ 550 పాయింట్ల లాభంతో ప్రారంభమై మరో 106 పాయింట్లు పెరిగింది. అక్కడినుంచి ప్రాఫిట్ బుకింగ్‌తో 198 పాయింట్లు తగ్గింది. నిఫ్టీ 161 పాయింట్ల గ్యాప్ అప్ లో ప్రారంభమై మరో 36 పాయింట్లు పైకి ఎగబాకింది. అక్కడినుంచి 73 పాయింట్లు కోల్పోయింది. ఉదయం 11 ప్రాంతంలో సెన్సెక్స్ 594 పాయింట్ల లాభంతో 76,653 వద్ద, నిఫ్టీ 160 పాయింట్ల లాభంతో 23,928 వద్ద ఉన్నాయి.

Top gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 25 స్టాక్స్ లాభాలతో, 5 స్టాక్స్ నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. ఎటర్నల్ 4.18 శాతం, ఇన్ఫోసిస్ 3.63 శాతం, ఇండిగో 3.39 శాతం, ఆసియన్ పెయింట్ 2.92 శాతం, బజాజ్ ఫైనాన్స్ 2.91 శాతం 2.44 శాతం లాభాలతో ఉన్నాయి.

Losers : అదానీపోర్ట్స్ 0.48 శాతం, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 0.15 శాతం, కొటక్ బ్యాంక్ 0.08 శాతం, యాక్సిస్ బ్యాంక్ 0.02 శాతం, ఎయిర్‌టెల్ 0.01 శాతం నష్టాలతో ఉన్నాయి.

ఇది కూడా చదవండి..: July 27 Market Analysis | మిక్స్‌డ్‌గా గ్లోబల్ మార్కెట్లు..పాజిటివ్ ఓపెనింగ్​ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *