అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Seattle Food Festival | అమెరికా (America)లో మరోసారి కాల్పుల కలకలం రేగింది. సియాటిల్‌లోని స్పేస్ నీడిల్ సమీపంలో ఉన్న ఒక ఈవెంట్స్ కాంప్లెక్స్‌లో ఆదివారం సాయంత్రం (యూఎస్ కాలమానం ప్రకారం) జరిగిన ఫుడ్ ఫెస్టివల్లో ఓ వ్యక్తి కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఇద్దరు మరణించగా, మరో ఐదుగురు గాయపడ్డారని అధికారులు తెలిపారు.
బైట్ ఆఫ్ సియాటిల్ ఫెస్టివల్ సందర్భంగా సియాటిల్ సెంటర్లో సాయంత్రం 6 గంటల ప్రాంతంలో కాల్పులు జరిగాయి. హార్బర్వ్యూ మెడికల్ సెంటర్ ప్రతినిధి సూసన్ గ్రెగ్ మాట్లాడుతూ ఒక చిన్నారి, 23 ఏళ్ల యువకుడు, ఇద్దరు మహిళలతో సహా నలుగురు బాధితులను ఆసుపత్రిలో చేర్చామన్నారు. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. కాల్పుల అనంతరం పెద్ద సంఖ్యలో పోలీసులు, అత్యవసర సిబ్బంది స్పందించి ఘటన స్థలానికి చేరుకున్నారు. ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయించారు.
Seattle Food Festival | మూడు రోజుల పాటు..
ఈ ఫుడ్ ఫెస్టివల్ 1982లో ప్రారంభంది. ప్రతి సంవత్సరం జరిగే ఈ ఉత్సవాలు మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు. 3.5 లక్షల మంది హాజరు అవుతారు. కాగా వేడుకల్లో ఒక్కసారిగా పేలుళ్ల శబ్దం వినిపించడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. ఒక అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందన్నారు. కాల్పులకు పాల్పడింది ఎవరు, ఎందుకోసం చేశారనే కోణాల్లో విచారణ చేపడుతున్నారు.
ఇది కూడా చదవండి..: Iran US Attacks | అమెరికా దాడులకు విరామం.. మధ్యప్రాచ్యంలోని యూఎస్ మిత్రదేశాలపై ప్రతీకార దాడులు నిలిపివేసిన ఇరాన్