అక్షరటుడే, వెబ్‌డెస్క్: India Pakistan UN | న్యూయార్క్‌లో జరిగిన ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ (Shahbaz Sharif) చేసిన ప్రసంగంలోని వ్యాఖ్యలకు భారత్ శనివారం కౌంటర్ ఇచ్చింది. దౌత్యవేత్త పెటల్ గెహ్లాట్ షరీఫ్ వ్యాఖ్యలను “విచిత్రంగా” అభివర్ణించారు.
ఆమె మాట్లాడుతూ.. అమెరికా ఇప్పుడే 9/11 దాడుల వార్షికోత్సవాన్ని జరుపుకుందన్నారు. దాని సూత్రధారి పాకిస్థాన్ సైన్యానికి చెందిన ప్రముఖ అకాడమీకి సమీపంలోనే నివసిస్తున్నాడని ఎత్తి చూపారు. పాక్ ప్రధాని షరీప్ శుక్రవారం ఐరాస సమావేశంలో కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తారు. దీనిపై భారత్ స్పందిస్తూ.. పాక్ పగటిపూట భద్రతను కాపాడుతున్నామని చెప్పుకుంటూ, రాత్రిపూట ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తోందని విమర్శించింది. ఉగ్రవాదానికి పరిణామాలు ఉంటాయని పాకిస్థాన్‌ను భారత్ హెచ్చరించింది.
India Pakistan UN | తీవ్ర పరిణామాలు ఉంటాయి
పాకిస్థాన్ ఉగ్రవదాన్ని ప్రోత్సహిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని భారత్ దౌత్యవేత్త తెలిపారు. టెర్రరిస్టులు పారిపోవడానికి గానీ, దాక్కోవడానికి గానీ చోటు ఉండదని తాము గతంలో నిరూపించామని చెప్పారు. పాకిస్థాన్ ప్రతినిధులు అబద్ధాలతో చెప్పేదాన్ని బట్టి కాకుండా, దాని విధానాలను ఉన్నది ఉన్నట్లుగా గుర్తించాలని భారత్ ఐక్యరాజ్యసమితికి సూచించింది. జమ్మూ కశ్మీర్ ఎప్పటికి భారత్‌లో అంతర్భాగం అని ఆమె స్పష్టం చేశారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలను ఎత్తి చూపారు.
ఇది కూడా చదవండి..: Youtuber Home Robbery | యూట్యూబ్‌లో డబ్బుల వీడియో.. సీన్ కట్ చేస్తే రూ.1 కోటి, కిలో బంగారం మాయం!