అక్షరటుడే వెబ్‌డెస్క్: IndiGo Fuel Charges | దేశీయ విమానయాన రంగ దిగ్గజం ఇండిగో (IndiGo) ప్రయాణికులకు బిగ్ షాక్ ఇచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లో విమాన ఇంధన (ఏటీఎఫ్ – ATF) ధరలు విపరీతంగా పెరుగుతుండటంతో, దేశీయ , అంతర్జాతీయ సర్వీసులపై ఫ్యూయల్ ఛార్జీలను సవరిస్తున్నట్లు ప్రకటించింది. అక్టోబర్ 6 అర్ధరాత్రి (00:01 గంటల) నుంచి చేసే అన్ని కొత్త టికెట్ బుకింగ్స్‌కు ఈ పెంపు వర్తిస్తుందని స్పష్టం చేసింది.
IndiGo Fuel Charges | పెరుగుదలకు అసలు కారణం..
మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో నెలకొన్న భౌగోళిక ఉద్రిక్తతల వల్ల చమురు ధరల్లో తీవ్ర అస్థిరత ఏర్పడిందని, నెల వ్యవధిలోనే ఏటీఎఫ్ ధరలు గణనీయంగా ఎగబాకాయని పేర్కొంది. ఎయిర్‌లైన్స్ నిర్వహణ వ్యయంలో ఇంధన ఖర్చు అత్యంత కీలకం కావడంతో ఈ భారాన్ని మోయక తప్పట్లేదని యాజమాన్యం వెల్లడించింది.
IndiGo Fuel Charges | కొత్త ఛార్జీలు..
డొమెస్టిక్ సెక్టార్లో ప్రయాణించే దూరాన్ని బట్టి ఫ్యూయల్ ఛార్జీలను సవరించారు. దేశీయ రూట్లలో 500 కి.మీ లోపు ప్రయాణానికి రూ. 375, 501 నుంచి 1000 కి.మీ వరకు రూ. 600, 1001 నుంచి 1500 కి.మీ వరకు రూ. 900, అలాగే 1501 నుంచి 2000 కి.మీ వరకు ప్రయాణించే వారికి రూ. 1,150 చొప్పున ఛార్జీలను నిర్ణయించారు. ఇక 2000 కి.మీ కంటే ఎక్కువ దూరానికి ప్రయాణించే ప్రయాణికులు రూ. 1,300 ఫ్యూయల్ ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది.
IndiGo Fuel Charges | వసూలు చేసే ఛార్జీలు..
విదేశీ ప్రయాణాలు చేసే వారు రూట్లను బట్టి అదనంగా ఫ్యూయల్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. అంతర్జాతీయ రూట్లలో సార్క్ (SAARC) దేశాలకు రూ. 1,000 నుంచి రూ. 3,000 వరకు, ఆగ్నేయాసియా, గల్ఫ్ (మిడిల్ ఈస్ట్) , తూర్పు ఆసియా దేశాలకు రూ. 5,500 చొప్పున ఛార్జీలను నిర్ణయించారు. అలాగే ఆఫ్రికాకు వెళ్లే ప్రయాణికులు రూ. 6,000 చెల్లించాల్సి ఉండగా, యూరప్ మార్గాలకు గరిష్టంగా రూ. 10,000 వరకు ఫ్యూయల్ ఛార్జీ వర్తిస్తుంది. ఇంధన ధరల పెరుగుదల కారణంగా ప్రయాణికులపై పడుతున్న అదనపు భారాన్ని తట్టుకునేందుకే ఈ నామమాత్రపు పెంపును తెచ్చామని, దీనివల్ల ప్రయాణికులకు కలుగుతున్న అసౌకర్యానికి చింతిస్తున్నట్లు ఇండిగో తెలిపింది.
ఇది కూడా చదవండి: Orient Cables IPO | లిస్టింగ్‌లో అ‘ధర’గొట్టిన ఓరియంట్ కేబుల్స్.. ప్రారంభంలోనే 65 శాతం లాభాలు