Orient Cables IPO | లిస్టింగ్‌లో అ‘ధర’గొట్టిన ఓరియంట్ కేబుల్స్.. ప్రారంభంలోనే 65 శాతం లాభాలు

ఓరియంట్ కేబుల్స్ కంపెనీ షేర్లు సోమవారం స్టాక్ మార్కెట్‌లో లిస్టయ్యాయి. ఐపీవో అలాట్ అయినవారికి ప్రారంభంలోనే 65 శాతం లాభాలను అందించాయి.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Orient Cables IPO | నెట్‌వర్కింగ్ కేబుల్స్ మరియు పాసివ్ నెట్‌వర్కింగ్ పరికరాల రంగంలో అగ్రగామి సంస్థలలో ఓరియంట్ కేబుల్స్ ఒకటి. బ్రాడ్‌బ్యాండ్, టెలికాం, డేటా సెంటర్లు, పునరుత్పాదక శక్తి, స్మార్ట్ బిల్డింగ్ ఆటోమేషన్/సెక్యూరిటీ, సిస్టమ్ ఇంటిగ్రేషన్, ఆటోమోటివ్ వంటి అధునాతన పరిశ్రమలకు కేబుల్స్, పరికరాలను అందిస్తోంది. 2025 ఆర్థిక సంవత్సరంలో సుమారు 22 శాతం మార్కెట్ వాటాతో దేశంలోని టాప్ ఐదు నెట్‌వర్కింగ్ కేబుల్ కంపెనీలలో ఇది ఒకటిగా నిలిచింది.

Orient Cables IPO | రూ. 552 కోట్ల ఐపీవో..

మార్కెట్‌నుంచి రూ. 552 కోట్లు సమీకరించాలన్న లక్ష్యంతో ఈ కంపెనీ ఐపీవో (IPO)కు వచ్చింది. ఇందులో రూ. 320 కోట్లు ఫ్రెష్ ఇష్యూ. మిగిలినది ఆఫర్ ఫర్ సేల్.

Orient Cables IPO | మంచి డిమాండ్..

ఓరియంట్ కేబుల్స్ కంపెనీ ఐపీవోకు ఇన్వెస్టర్లనుంచి మంచి డిమాండ్ లభించింది. మొత్తం ఇష్యూ 97.28 రెట్లు సబ్‌స్క్రైబ్ అయ్యింది. ఇందులో క్యూఐబీ కోటా 192.68 రెట్లు, ఎన్ ఐఐ కోటా 121.90 రెట్లు, రిటైల్ కోటా 32.21 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబ్ అయ్యాయి.

Orient Cables IPO | భారీ లిస్టింగ్ గెయిన్స్..

కంపెనీ షేర్లకు గ్రే మార్కెట్‌లో మంచి డిమాండ్ కనిపించింది. సోమవారం ఉదయం జీఎంపీ 40 శాతంగా ఉంది. కంపెనీ ఒక్కో ఈక్విటీ షేరును రూ. 272కు విక్రయించగా.. సోమవారం ఉదయం 65.44 శాతం లాభాలతో రూ. 450 వద్ద లిస్టయ్యింది. అయితే లిస్టింగ్ తర్వాత నిరాశపరిచింది. కొద్దిసేపటిలోనే రూ. 405కు పడిపోయి లోయర్ సర్క్యూట్‌ను తాకింది. మొత్తానికి ఐపీవో అలాట్ అయినవారికి తొలిరోజు 48.90 శాతం లాభాలను అందించింది.

ఇదికూడా చదవండి: India US Trade Deal | ట్రేడ్ డీల్‌పై ఆర్థిక మంత్రి సంచలన ప్రకటన.. ఇక ఆశలు వదులుకోవాల్సిందేనా?

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *